అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ ఆంక్షలు, దురాగతాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా తాలిబన్ ప్రభుత్వ అధికారులు సంగీతం అనైతికమైనదని తీర్మానిస్తూ ప్రజల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న సంగీత పరికరాలను హెరాత్ ప్రాంతంలో దహనం చేశారు. ఈ సందర్భంగా స్థానిక అధికారి అల్-ముజ్రిమ్ మాట్లాడుతూ సంగీతాన్ని ప్రోత్సహించడం అనేది నైతిక విలువలను దెబ్బతీస్తుందని, సంగీతాన్ని వాయించేవారు తప్పుదారి పడతారని వ్యాఖ్యానించారు.
2021 ఆగస్టులో అఫ్ఘానిస్తాన్‌ను కబ్జా చేసుకున్న తాలిబాన్ నేతలు ఇష్టమొచ్చిన రీతిన కఠిన శాసనాలను, చట్టాలను చేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా బహిరంగంగా సంగీతం ఆలపించడంపై నిషేధం విధించారు. దీనికి ముందు బ్యూటీ పార్లర్లపై నిషేధం విధించారు. తాజాగా వేల డాలర్ల విలువైన వాయిద్య పరికరాలను స్థానిక ప్రజల నుంచి స్వాధీనం చేసుకుని వాటిని దహనం చేశారు. వీటిలో గిటార్, తబలా, డ్రమ్ తదితర వాయిద్య పరికరాలతో పాటు ఆంప్లిఫయర్, స్పీకర్ మొదలైనవి కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: రణభూమిలో యోగ సాధన: సిరియా ముఖచిత్రాన్ని మారుస్తున్న రిషికేశ్
"Music causes moral corruption and playing it will cause the youth to go astray."
— AFP News Agency (@AFP) July 31, 2023
Afghanistan's vice ministry burns musical instruments and equipment, deeming music immoralhttps://t.co/as5hDUQ7BX pic.twitter.com/eh9xSgWhkU
Comments
Please login to add a commentAdd a comment