తాలిబన్ల నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ‘ఆఫ్ఘని’ ఆశ్చర్యకరంగా టాప్‌లోకి దూసుకొచ్చింది. ఈ త్రైమాసికంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ పనితీరుతో టాప్-3లో చోటు సంపాదించుకుంది. రెండేళ్ళ క్రితం తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత అక్కడి ఆర్థికపరిస్థితి అతలాకుతమైంది. ఆఫ్ఘన్ జాతీయ కరెన్సీ విలువ దారుణంగా పతనమైంది. కానీ తాలిబన్ల కీలక చర్యలతో ఈ త్రైమాసికంలో ఆఫ్గని అనూహ్యంగా పుంజుకోవడం విశేషంగా నిలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం కొలంబియన్ పెసో, శ్రీలంక రూపాయి తర్వాత 2023లో ప్రపంచంలో మూడో అత్యంత బలమైన పనితీరు కనబర్చిన కరెన్సీగా అవతరించింది.
ముఖ్యంగా మానవతా దృక్పథంతో ఆ దేశానికి అందిన మిలియనర్ల డాలర్ల సాయం, పొరుగు దేశాలతో పెరిగిన వాణిజ్యం దీనికి కారణమని భావిస్తున్నారు. మానవ హక్కుల విషయంలో ప్రపంచంలోనే దారుణంగా పడిపోయి, పేదరిక పీడిత దేశంగా పేరొందిన ఆఫ్గాన్ కరెన్సీ బలోపేతం చేయడానికి తాలిబాన్ చర్యలు కూడా ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్ తన కరెన్సీ బలోపేతం చేయడానికి అనేక చర్యలను అమలు చేసింది. ఆఫ్ఘని సంవత్సరానికి దాదాపు 14శాతం పెరుగుదలను నమోదు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మూడవ బలమైన కరెన్సీగా నిలిచింది, కొలంబియన్ పెసో మరియు శ్రీలంక రూపాయి కంటే మాత్రమే వెనుకబడి ఉంది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, కరెన్సీ నియంత్రణలు, నగదు ప్రవాహం,చెల్లింపులతో ఆఫ్ఘని ఈ త్రైమాసికంలో సుమారుగా 9 శాతం పుంజుకుంది. కొలంబియన్ పెసో 3 శాతం లాభాలను అధిగమించింది. (ఈ బ్యాంకు లైసెన్స్ రద్దుచేసిన ఆర్‌బీఐ: అకౌంట్ ఉందా చెక్ చేసుకోండి!)
కరెన్సీలో ఈ పెరుగుదల ఆఫ్ఘనిస్తాన్ అంతర్గతం సంక్షోభం ఇంకా అలాగే ఉందనీ, ముఖ్యంగా ఆర్థిక ఆంక్షల కారణంగాకా దేశం ప్రపంచ ఆర్థికవ్యవస్థ నుంచి దూరంగా ఉందంటున్నారు ఆర్థికవేత్తలు. ప్రధానంగా నిరుద్యోగం తీవ్రంగా ఉంది. మూడింట రెండొంతుల కుటుంబాలు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడుతున్నాయి. ద్రవ్యోల్బణానికి బదులుగా ప్రతి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోందని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. 2021 చివరి నుంచి ప్రతి కొన్ని వారాలకు ఐక్య రాజ్యసమితి క్రమం తప్పకుండా 40 మిలియన్ల డాలర్లకు పైగా సాయం అందిస్తోంది. మరోవైపు కరెన్సీ నియంత్రణలు ప్రస్తుతానికి పని చేస్తున్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్‌లో ఆర్థిక, సామాజిక, రాజకీయ, అస్థిరత ఏర్పడొచ్చని వాషింగ్టన్‌లోని న్యూ లైన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజీ & పాలసీలో మిడిల్ ఈస్టర్న్, సెంట్రల్ అండ్ దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడు కమ్రాన్ బోఖారీ హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment