
సాక్షి, కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని విశ్వవిద్యాలయాల్లో మహిళలు పోస్టు గ్రాడ్యుయేట్ వరకు చదువు కొనసాగించవచ్చునని తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. అయితే, తరగతి గదుల్లో పురుషులకు, మహిళలకు వేరుగా ఏర్పాట్లుండాలనీ, విద్యార్థినులకు ఇస్లామ్ సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరని స్పష్టం చేసింది. తాలిబన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ ఆదివారం మీడియాతో మాట్లాడారు.
20 ఏళ్ల క్రితం అనుసరించిన విధానాలనే మళ్లీ తాము అమలు చేయాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. బాలబాలికలు కలిసి చదువు కొనసాగించేందు(కో ఎడ్యుకేషన్)కు అనుమతించబోమన్నారు. బాలికలు హిజాబ్ ధరించడం తప్పనిసరని తెలిపారు. వ్సటీల్లో బోధించే సబ్జెక్టులపై సమీక్ష చేపడతామన్నారు.
చదవండి: అఫ్గాన్: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు
Comments
Please login to add a commentAdd a comment