
Afghanistan: ఆఫ్ఘన్‌లో తాలిబన్లు మళ్లీ వారి పాత విధానాలను ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యారు.
ఆఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఎట్టకేలకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమ గత పరిపాలనలా ప్రస్తుతం ఉండబోదని అఫ్గన్ ప్రజలకు తాలిబన్లు చెప్పిన మొదటి మాట ఇది. అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలు, తాలిబన్లు అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే ఆ మాట మీద వాళ్లు నిలబడడం లేదనే తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా తాలిబన్ నేత నుంచి వచ్చిన మరో ప్రకటనను చూస్తే అది అర్థమవుతుంది.
అఫ్గన్‌లో తాలిబన్లు మళ్లీ వారి పాత విధానాలనే ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యారు. 1990లో మాదిరిగానే ప్రస్తుత పరిపాలనలో కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని తాలిబన్లు తేల్చి చెబుతున్నారు. ఈ అంశంపై తాలిబన్ వ్యవస్థాపక సభ్యుడు ముల్లా నూరుద్దీన్ తురాబీ మీడియాతో మాట్లాడుతూ.. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమ చట్టాలు, పరిపాలను ఎలా ఉండాలనేది ఇతర దేశాలు చెప్పకూడదన్నారు.
చదవండి: Freshworks Company: ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...!