పోలీస్ స్టేషన్పై తీవ్రవాదుల దాడి: ఒకరు మృతి | Militants attack Jammu police station, kill policeman | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్పై తీవ్రవాదుల దాడి: ఒకరు మృతి

Published Fri, Mar 20 2015 8:49 AM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM

Militants attack Jammu police station, kill policeman

జమ్మూ: జమ్మూలో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కత్వా జిల్లాలోని రాజ్బాగ్ పోలీస్ స్టేషన్పై తీవ్రవాదులు శుక్రవారం తెల్లవారుజామున గ్రానేడ్లతో దాడి చేశారు. అనంతరం పోలీసు స్టేషన్పై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి తీవ్రవాదులపై కాల్పులు జరిపారు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి.

జమ్మూ -పఠాన్కోట్ జాతీయరహదారికి సమీపంలోని  పోలీసు స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ను నిలిపివేశారు. 2013, సెప్టెంబర్ 26న కత్వా జిల్లాలోని హీరానగర్ పోలీసుస్టేషన్పై గెరిల్లాలు దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. అనంతరం జమ్ము -పఠాన్కోట్ జాతీయ రహదారిపై ఉన్న ఆర్మీ శిబిరంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement