ఉగ్రకాల్పుల్లో ఏఎస్‌ఐ దుర్మరణం | The ASI is dead in the fire | Sakshi
Sakshi News home page

ఉగ్రకాల్పుల్లో ఏఎస్‌ఐ దుర్మరణం

Published Tue, Aug 29 2017 1:58 AM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

ఉగ్రకాల్పుల్లో ఏఎస్‌ఐ దుర్మరణం - Sakshi

ఉగ్రకాల్పుల్లో ఏఎస్‌ఐ దుర్మరణం

శ్రీనగర్‌: దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో మిలిటెంట్ల ఆకస్మిక దాడిలో మరో పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అనంత్‌నాగ్‌లోని మెహందీ కాదల్‌ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్‌ఐ అబ్దుల్‌ రషీద్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సమయంలో రషీద్‌ వద్ద ఆయుధం లేదు. బుల్లెట్‌ గాయాలైన రషీద్‌ను వెంటనే దగ్గర్లోని అనంత్‌నాగ్‌ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం శ్రీనగర్‌ దగ్గర్లోని బదామీబాగ్‌ కంటోన్మెంట్‌ సైనిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శాయశక్తులా కృషిచేసినా ఫలితం లేకుండా పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement