స్టాక్ మార్కెట్ పై ఇరాక్ దెబ్బ
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ లో నిన్నటి ముగింపుకు 54 పాయింట్ల లాభంతో ఆరంభమైన సెన్సెక్స్.. ఓదశలో 25,609 గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది.
అయితే ఇరాక్ రిఫైనరీలపై మిలిటెంట్లు దాడి చేశారనే వార్తల ప్రభావంతో అనూహ్యంగా ప్రధాన సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 350 పాయింట్ల నష్టంతో 25171 వద్ద, నిఫ్టీ 101 పాయింట్ల పతనంతో 7,529 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో అత్యధికంగా బీపీసీఎల్ 3.93 శాతం, భెల్ 2.36, ఐడీఎఫ్ సీ 2.28 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.10, టీసీఎస్ 2.07 శాతం నష్టపోయాయి.
కొటాక్ మహీంద్ర, సిప్లా, అల్ట్రా టెక్ సిమెంట్, భారతీ ఎయిర్ టెల్, యాక్సీస్ బ్యాంక్ లు స్వల్ప లాభాల్లో ట్నేడ్ అవుతున్నాయి.