Germany woman
-
Picture of the Year award: అమానుష ఫొటోకు అవార్డా!
వాషింగ్టన్: ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపుదాడి ఘటనలో ఒక యువతిని అపహరించి అర్ధనగ్నంగా ఊరేగించిన ఫొటోకు అంతర్జాతీయ అవార్డ్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఫొటోలో యువతిని బ్లర్ చేయకుండానే ఇంటర్నెట్లో పెట్టడంతో అవార్డుల సంస్థపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న సంగీత విభావరిపై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడం, దాదాపు 360 మందిని చంపేయడం తెలిసిందే. జర్మనీకి చెందిన 22 ఏళ్ల పర్యాటకురాలు షానీ లౌక్తో పాటు పలువురిని కిడ్నాప్ చేశారు. ఆమెను అపహరించి అర్ధనగ్నంగా గాజా వీధుల్లో ఊరేగిస్తుండగా ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ వార్తాసంస్థ పలు ఫొటోలు తీసింది. నాటి దారుణానికి సజీవ సాక్ష్యంగా నిలిచిందంటూ ఈ ఫొటోకు ‘ టీమ్ పిక్చర్ స్టోరీ ఆఫ్ ది ఇయర్’ కేటగిరీ కింద ప్రథమ బహుమతి ప్రకటించారు. అమెరికాలోని కొలంబియాలో ఉన్న మిస్సోరీ స్కూల్ ఆఫ్ జర్నలిజం విభాగమైన డొనాల్డ్ రేనాల్డ్స్ జర్నలిజం ఇన్స్టిట్యూట్ ఈ అవార్డును ప్రకటించింది. ఊరేగింపు ఘటన జరిగిన కొద్ది రోజులకు గాజాలో షానీ లౌక్ పుర్రె భాగం ఇజ్రాయెల్ బలగాలకు దొరికింది. దీంతో హమాస్ మూకలు ఈమెను చిత్రవధ చేసి చంపేశాయని ఇజ్రాయెల్ అక్టోబర్ 30న ప్రకటించింది. ఆమె మృతదేహం ఇంకా గాజాలోనే ఉంది. నాటి నరమేధానికి బలైన అభాగ్యురాలిని ఇలా అవార్డు పేరిట అవమానిస్తారా? అంటూ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ ఫొటోలను అసోసియేటెడ్ ప్రెస్ తీయలేదని, హమాస్ మిలిటెంట్లలో ఒకరు తీసిన ఫొటోలను అసోసియేటెడ్ ప్రెస్ సంపాదించిందని కొందరు వ్యాఖ్యానించారు. -
జర్మనీ మహిళను నగ్నంగా ఊరేగించిన హమాస్
జెరూసలేం: ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి సందర్భంగా బందీలుగా పట్టుకున్న వారిపై హమాస్ మిలిటెంట్ల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శని లౌక్ అనే జర్మనీ దేశస్తురాలిని శనివారం గాజా వీధుల్లో నగ్నంగా ఊరేగించి పైశాచికానందం పొందడం తెలిసిందే. ‘‘శని క్రెడిట్ కార్డును గాజాలో పూర్తిగా వాడేశారు. తను కనీసం ప్రాణాలతోనైనా ఉందని ఆశపడుతున్నాం’’అంటూ ఆమె తల్లి బావురుమంది. శనివారం ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతమైన కిబుట్జ్ సమీపంలో ఫెస్టివల్ ఆఫ్ పీస్ జరుగుతుండగా హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడిచేసి పలువురిని బందీలుగా గాజాకు తరలించారు. -
వైరల్ వీడియో : ఉల్లిగడ్డలను పొలంలో నాట్లు వేస్తున్న జర్మనీ కోడలు ..
-
పిచ్చా.. వెర్రా అసలు ఏం అనాలి?!
బెర్లిన్: పిచ్చి పలు రకాలు.. వెర్రి వేయి రకాలు అంటారు. నిజమే కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొ రకమైన పిచ్చి ఉంటుంది. కొందరికి ఉన్న పిచ్చి గురించి మనం తెలుసుకుంటే.. మనకు కూడా పిచ్చి పీక్స్‌కు వెళ్తుంది. ఓ వ్యక్తి చేసిన పని వల్ల ఇప్పుడు ఈ పిచ్చి పురాణాన్ని స్మరించుకోవాల్సి వచ్చింది. ఏమా పని అంటే ఇది చదవాల్సిందే. స్మార్ట్ఫోన్లకు బ్యాక్ కవర్ తప్పని సరి. ఎప్పుడైనా ఫోన్ కిందపడితే పగలకూడదని.. గీతలు పడకూడదనే ఉద్దేశంతో బ్యాక్ కవర్ వేస్తాం. అది పాతది అయితే పడేసి కొత్తది కొంటాం. అంతేతప్ప వాడేసిన ఈ బ్యాక్ కవర్ని అమ్మే సాహసం ఎవరు చేయరు. ఒకవేళ చేస్తే.. తిట్లు తినాల్సి వస్తుంది. యూట్యూబ్ ఇన్ఫ్లూయేంజర్గా పని చేస్తున్న జర్మనీకి చెందిన బియాంకా క్లాసెన్ మాత్రం పాత ఫోన్ కవర్ని ఏకంగా కోటి రూపాయలకు అమ్మింది. బియాంకా ఓ సారి అండర్ వాటర్ ఫోటో షూట్లో పాల్గొన్నప్పుడు ఆమె ఫోన్ తడిసిపోయింది. (చదవండి: ట్రూ లవ్.. ఆలస్యంగా నడిచిన 23 రైళ్లు ) దాంతో దాని బ్యాక్ కవర్ తీసి కప్‌బోర్డ్‌లో పడేసింది. ఇక దాని గురించి మర్చిపోయింది. అలా పడేయడం వల్ల ఆ బ్యాక్ కవర్ రంగు పోయి.. ఓ పెయింటింగ్‌లా కనిపించింది. ఓ రోజు ఎందుకో కప్బోర్డ్ ఒపెన్ చేసిన బియాంకాకి ఫోన్ బ్యాక్ కవర్ కనిపించింది. పూర్తిగా పాడయిన దాన్ని పడేద్దామనుకుంటుండగా ఆమెకు ఓ వింత ఐడియా వచ్చింది. దీన్ని అమ్మకానికి పెడితే ఎలా ఉంటుందని భావించింది. దాంతో తన ఫోన్ బ్యాక్ కవర్ని ఈబేలో అమ్మకానికి పెట్టింది. ఆమె చేసిన పనే వింత అనుకుంటే ఆమె కన్నా వింత వ్యక్తి ఒకరు ఈ పాత వాడేసిన కవర్‌కి ఏకంగా 1,62,907 డాలర్లు(1,19,22,153.31 రూపాయలు) చెల్లించేందుకు సిద్ధపడ్డాడు. ఏదో సరదాకి చేసిన పనికి ఇంత మంచి ధర పలకడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది బియాంకా. ఈ మొత్తం డబ్బుని ఓ చారిటీకి ఇచ్చి.. ఇళ్లు లేని వారికోసం ఖర్చు చేస్తానని వెల్లడించింది. ఇక వీరి పనికి నెటిజనులు మీరు, మీ పిచ్చికి ఓ దండం సామీ అంటున్నారు. -
అక్కడి అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి
ములుగు రూరల్, న్యూస్‌లైన్: వివాహానికి కులం, మతం, జాతే కాదు ప్రాంతం కూడా అతీతం కాదని యువ జంట రుజు వు చేసింది. ములుగు మం డలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన మార్త రమణారెడ్డి కుమారుడైన మార్త సందీప్ రెడ్డి 12 సంవత్సరాల క్రితం ఉద్యోగ రిత్యా జర్మనీకి వెళ్లా డు. అతడు పని చేసే సాఫ్ట్వేర్ కంపెనీలో తోటి ఉద్యోగినితో 8 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. స్వీడన్‌కు చెందిన అందన్, జాకన్యల కుమారై నాన్సీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో సందీప్‌రెడ్డితో వివాహానికి ఒప్పుకుంది. స్థానిక డీఎల్ ఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం వారి వివాహం జరిగింది.