
సిడ్నీ: వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ 'నగ్న' వివాదంలో విజయం సాధించాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ కోర్టును ఆశ్రయించగా అతడినే విజయం వరించింది. 2015 ప్రపంచకప్ సందర్భంగా డ్రస్సింగ్ రూమ్‌లో గేల్ ఉన్న సమయంలో మసాజ్ థెరపిస్ట్ లిన్నే రస్సెల్ ఆ గదికి వచ్చి టవల్ వెతుకుతోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న గేల్ ఏం వెతుకుతున్నావంటూ ఆమెను అడిగగా.. టవల్ కోసమని ఆమె బదులిచ్చారు. తాను కట్టుకున్న టవల్ విప్పి నగ్నంగా మారిన గేల్.. ఆ టవల్ ఇదేనా అంటూ లీన్నె రస్సెల్‌కు తన మర్మాంగాన్ని చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని గత జనవరిలో సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ద ఏజ్, ద కాన్‌బెర్రా టైమ్స్ లలో కథనాలు వచ్చాయి.
ఆరోపణలపై గతంలోనే స్పందించిన గేల్.. వివాదాన్ని పరిష్కరించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే కొన్ని ఆస్ట్రేలియా మీడియా సంస్థలు తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నాయని ఆరోపిస్తూ గత వారం గేల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సోమవావరం విచారణ జరిపిన ఎన్‌ఎస్‌డబ్ల్యూ సుప్రీంకోర్టు గేల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 'ఆధారాలు లేకుండా మీడియా ఆసక్తికర కథనాలు రాసిందే తప్ప అందులో నిజనిజాలు తెలుసుకునే యత్నం చేయలేదు. దేశం తరఫున ఆడే ఉన్నత వ్యక్తి విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రవరిస్తారంటూ' కోర్టు పత్రికల యాజమాన్యాలను ప్రశ్నించింది.
'నేను చాలా మంచి వ్యక్తిని. దీనికి సిగ్గు పడాల్సిన పనిలేదు. కోర్టు తీర్పు నాకు అనుకూలంగా రావడంతో సంతోషంగా ఉన్నాను' అని గేల్ కోర్టు తీర్పు అనంతరం గేల్ వ్యాఖ్యానించాడు. విస్టిండీస్ జట్టు ఆటగాడు, గేల్ సహచరుడు డ్వేన్ స్మిత్ సైతం కోర్టుకు హాజరై.. గేల్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చెప్పాడు. ఆరోజు టవల్ విప్పేసి గేలా అలా అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణల్లో వాస్తవం లేదని కోర్టుకు వివరించాడు. మరోవైపు బాధితురాలు లిన్నే రస్సెల్ ఇటీవల మీడియా ముందుకు వచ్చి.. గేల్ నగ్నంగా మారి తనతో అసభ్యంగా, అమర్యాదగా ప్రవర్తించాడని ఆరోపించడం వివాదానికి దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment