సిడ్నీ: వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ 'నగ్న' వివాదంలో విజయం సాధించాడు. మసాజ్ థెరపిస్ట్‌తో అసభ్యంగా ప‍్రవర్తించిన కేసులో భాగంగా తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ కోర్టును ఆశ్రయించిన గేల్‌కు భారీ ఊరట లభించింది. గత వన్డే వరల‍్డ్ కప్ సందర్భంగా మసాజ్ థెరపిస్ట్ లిన్నే రస్సెల్‌కు తన మర్మాంగాన్ని చూపించి గేల్ అసభ్యంగా ప‍్రవర్తించాడని ఫెయిర్ ఫాక్స్ అనే మీడియా సంస్థ వరుసగా వార్తలు రాసుకొచ్చింది.
2015 ప్రపంచకప్ సందర్భంగా డ్రస్సింగ్ రూమ్‌లో గేల్ ఉన్న సమయంలో మసాజ్ థెరపిస్ట్ ఆ గదికి వచ్చి టవల్ వెతుకుతోందని, అప్పుడు అక్కడే ఉన్న గేల్ ఏం వెతుకుతున్నావంటూ ఆమెను అడిగగా.. టవల్ కోసమని ఆమె బదులిచ్చారు. తాను కట్టుకున్న టవల్ విప్పి నగ్నంగా మారిన గేల్.. ఆ టవల్ ఇదేనా అంటూ లీన్నె రస్సెల్‌కు తన మర్మాంగాన్ని చూపించి అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫెయిర్ ఫాక్స్ అనే మీడియా సంస్థ వరుసగా కథనాలను ప్రసారం చేసింది.
గతంలోనే ఈ ఆరోపణలపై స్పందించిన గేల్.. వివాదాన్ని పరిష్కరించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఫెయిర్ ఫాక్స్ తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నాయని ఆరోపిస్తూ గేల్ న్యూసౌత్ వేల్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే తన కథనాలపై వాస్తవాలను కోర్టుకు సమర్పించడంలో ఫెయిర్ ఫాక్స్ మీడియా విఫలమైంది. దీనిలో భాగంగా ఈ కేసుకు సంబంధించి గతేడాది అక్టోబర్‌లోనే గేల్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ కేసును విచారించిన జ్యూరీ గేల్‌కు అనకూలంగా తీర్పునిచ్చింది. కాగా. తాజాగా పరువు నష్టం కింద (220, 770 అమెరికన్ డాలర్లు) సుమారు ఒక కోటి యాభై లక్షల రూపాయిలను గేల్‌కు అందజేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం విచారించిన జడ్జి లుసీ మెకల్లమ్.. ఎటువంటి ఆధారాలు లేకుండా గేల్‌కు పరువుకు భంగం వాటిల్లే విధంగా కథనాలు రాసినందుకు ఫెయిర్ ఫాక్స్ మీడియాకు భారీ మొత్తంలో జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment