
పెర్త్: సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న ఎల్జీబీటీ కమ్యూనిటీకి అండగా నిలబడాలని పెర్త్ హాకీ ఆటగాళ్లు నిర్ణయించారు. ఇందుకోసం వాళ్లు ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించనిరీతిలో ఒంటిపై దుస్తులు విడిచి.. నగ్నంగా క్యాలెండర్ల ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.
సమాజంలో స్వలింగ సంపర్కులపై ఎంతో వివక్ష నెలకొందని, వారు ఎన్నో రకాలుగా దూషణలు ఎదుర్కొంటున్నారని, దీనికి వ్యతిరేకంగా తాము నిలబడాలని నిర్ణయించామని ద పెర్త్ పైథాన్ హాకీ జట్టు ఆటగాడు రీడ్ స్మిత్ తెలిపాడు. పెర్త్ పైథాన్ పురుష జట్టుతోపాటు ఆస్ట్రేలియా జాతీయ జట్టు ప్లేయర్స్ సైతం ఈ నగ్న ఫొటోషూట్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. హాకీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడంతోపాటు హోమోఫొబియోకు వ్యతిరేకంగా నిలబడేందుకు తాము ఫొటోషూట్‌లో పాల్గొన్నామని పెర్త్ పైథాన్ జట్టు ఆటగాళ్లు పేర్కొంటున్నారు. ఈ నెల 23న హాకీ ఆటగాళ్ల నగ్న క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment