ఇపో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 1-5 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్లో జపాన్ ను ఓడించి శుభారంభం చేసిన భారత్.. రెండో మ్యాచ్ లో మాత్రం పటిష్టమైన ఆస్టేలియాను నిలువరించడంలో విఫలమైంది.
ఆట ఐదో నిమిషంలోనే బ్లాక్ గోవర్స్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచి ఆస్ట్రేలియాను ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. అయితే ఎనిమిదో నిమిషంలో భారత ప్లేయర్ రూపేందర్ సింగ్ గోల్ చేయడంతో స్కోరు సమం అయ్యింది. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో డేవ్ వెటన్ ఇచ్చిన పాస్ ను అందుకున్న కోలీ గోల్ గా మలచడంతో ఆస్ట్రేలియా తొలి క్వార్టర్ ముగిసే సరికి 2-1 ఆధిక్యం సాధించింది. ఇక రెండో క్వార్టర్ లో కూడా ఆస్ట్రేలియా అదే ఊపును కొనసాగించింది. ఆట 20వ, 26వ నిమిషంలో ఆస్ట్రేలియా వరుస గోల్స్ సాధించి స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట చివరి క్వార్టర్ లో ఆస్ట్రేలియా మరో గోల్ చేసి 5-1తేడాతో ఘన విజయం సాధించింది.
అజ్లాన్ షా హాకీ: ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర ఓటమి
Published Thu, Apr 7 2016 4:19 PM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM
Advertisement
Advertisement