హనీట్రాప్‌ కేసులో ఎమ్మెల్యే వీడియో లీక్‌ | MLA Video Leak in Honey Trap Case Karnataka | Sakshi
Sakshi News home page

హనీట్రాప్‌ కేసులో ఎమ్మెల్యే వీడియో లీక్‌

Published Thu, Dec 12 2019 8:40 AM | Last Updated on Thu, Dec 12 2019 11:40 AM

MLA Video Leak in Honey Trap Case Karnataka - Sakshi

కర్ణాటక ,బనశంకరి: హనీట్రాప్‌ కేసులో సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హనీట్రాప్‌ లో ఇద్దరు అనర్హ ఎమ్మెల్యేలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు ముఠాలో చిక్కుకున్నారు. వీరిలో ఓ  ఎమ్మెల్యే సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపద్యంలో సీసీబీ పోలీసులు రఘు అలియాస్‌ రాఘవేంద్ర తో పాటు నలుగురు హనీట్రాప్‌ ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఓ ఎమ్మెల్యే హనీట్రాప్‌ ముఠాలో చిక్కిన వీడియో వైరల్‌ అయింది.

ఈ వీడియో రఘు అరెస్టైన అనంతరం అతడి ఇంట్లో ఇంకా కొంతమంది  ఎమ్మెల్యేల హనీట్రాప్‌ వీడియో గురించి నిజానిజాలు రాబట్టడానికి ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఈ వీడియోను సీసీబీ పోలీసులకు అందించింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ అందించిన నివేదిక అనంతరం మరిన్ని వీడియోలు బయటికి వచ్చాయి. నిజంగా ఎమ్మెల్యేలు హనీట్రాప్‌ లో చిక్కుకున్నారా లేక నకిలీ వీడియో సృష్టించి ఎమ్మెల్యేలను బెదిరించి డబ్బు తీసుకున్నారా అనే దాని గురించి సీసీబీ విచారించాల్సి ఉంది. హనీట్రాప్‌ గురించి ఎమ్మెల్యేల వద్ద సమాచారం రాబట్టడానికి సీసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement