పోలీసులకు పట్టుబడిన నిందితులు
బనశంకరి: సోషల్ మీడియా టెలిగ్రాం ద్వారా యువకులను పరిచయం చేసుకుని వారితో స్నేహంగా ఉంటూ యువతులతో హానీట్రాప్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం పుట్టేనహళ్లి పోలీసులు అరెస్ట్‌చేశారు. శరణ ప్రకాష్‌బళిగేర, అబ్దుల్ ఖాదర్, యాసిన్ పట్టుబడిన నిందితులు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు యువతితో పాటు మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ బృందంలోని యువతి, యువకులను పరిచయం చేసుకుని జేపీ.నగర ఐదోస్టేజ్ వినాయకనగర ఇంట్లోకి పిలిపించుకునేది. యువకులు ఇంట్లోకి రాగానే ప్లాన్ ప్రకారం హనీట్రాప్ గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి యువకుల మొబైల్ లాక్కుని యువతితో ఏం పని అని మాట్లాడుతూనే మొబైల్లో ఫొటో, వీడియో తీసి డబ్బు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులకు ఫొటో పంపించి పరువుతీస్తామని బెదిరించి రూ.50 వేలు లాక్కున్నారు. ఈ ఘటనపై బాధితుడు పుట్టేనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment