‘ఆ ఫొటోలు మార్ఫ్‌ చేసినవే..కావాలంటే ఫోరెన్సిక్‌ పరీక్ష చేయండి’ | sakshi special interview with kadambari jethwani victim kukka vidya sagar | Sakshi
Sakshi News home page

‘ఆ ఫొటోలు మార్ఫ్‌ చేసినవే..కావాలంటే ఫోరెన్సిక్‌ పరీక్ష చేయండి’

Published Fri, Aug 30 2024 9:57 PM | Last Updated on Sat, Aug 31 2024 7:24 AM

sakshi special interview with kadambari jethwani victim kukka vidya sagar

సాక్షి,హైదరాబాద్‌ : ఆమెకు ప్రముఖులు, పారిశ్రామక వేత్తలు, బ్యూరోక్రాట్లే టార్గెట్‌. ఆయనికి అచ్చంగా వాళ్లే టార్గెట్‌. ఇద్దరికి పెద్ద తేడాం ఏం లేదు. ఆమె పేరు కాదంబరి జత్వానీ. ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. పచ్చమీడియా గత నాలుగైదు రోజులుగా వండుతున్న పరమాన్నం మీరు చూసే ఉంటారు. అది ఈ రోజు దాకా చల్లారలేదు. ఇప్పట్లో చల్లారే అవకాశమే లేదు. అసలు ఎవరికోసం ఈ పరమాన్నం వండుతున్నారా? అని ఆరా తీస్తే. విస్తు గొలిపే విషయాలు బయటపడ్డాయి.

కాదంబరి జత్వానీ అలియాస్‌ కిలాడీ కాదంబరి జత్వానీ. చోటా నటి. బడా బ్లాక్‌మెయిలర్‌. అందమే ఆమె పెట్టుబడి. సినిమాల్లో నటన పార్ట్‌టైం. హనీట్రాప్‌ బిజినెస్‌ ఆమె ఫుల్‌ టైం. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమ పేరుతో వలపుల వల విసిరి ఆ తర్వాత వసూళ్లకు పాల్పడే ఖతర్నాక్‌ కిలాడీ లేడి. ఇంకా చెప్పాలంటే దోపిడీ గ్యాంగులతో సన్నిహిత సంబంధాలు. వ్యభిచార ముఠాలతో మిలాఖత్‌లు.. ఆమె డెయిలీ డ్యూటీలో భాగాలు. 

సంతకాలు ఫోర్జరీ చేయడం. భోగస్‌ పత్రాలు సృష్టించడం, భారీగా ఆస్తులు పోగేయడం ఆమె అసలు ప్రొఫెషన్‌. ఈ మాయలేడిని దందాను ఆసరగా చేసుకుని చంద్రబాబు సరికొత్త దందా తెరతీశారు. బాధితులకు బాసటగా నిలవాల్సింది పోయి.. బాధితులనే బెదిరింపులకు గురిచేస్తూ దొరికిన కాడుకి దండుకోవాలనుకునే వ్యూహం పన్నారు.

నిజం చెప్పాలంటే ఢిల్లీ, బెంగళూరుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పారిశ్రామిక వేత్తలు, రాజకీయవేత్తలు, బ్యూరోక్రాట్లను బ్లాక్‌ మెయిల్‌ చేసి, కోట్లను కొల్లగొట్టింది ఈ కాదంబరి జత్వానీ.

ఏషియన్‌ పెయింట్‌ ప్రమోటర్‌ మాలవ్‌ దాని కూడా ఆమె బాధితుల జాబితాలో ఒకరు. అయన ఫిర్యాదుతో ముంబై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అచ్చం అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కుక్కల విద్యాసాగర్‌కు వలపుల వల విసిరింది. ఆ తర్వాత బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడింది. విద్యాసాగర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది. 

ఎందరో ప్రముఖుల జీవితాలతో ఆడుకున్న మహానటిని చంద్రబాబు ఏపీకి తెచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పుచుకునేందుకు బాబు మనల్ని హనీట్రాప్‌లోకి లాగుతున్నారు. తానిచ్చిన హామీల మేరకు ఒక్క మహిళకు న్యాయం చేయని చంద్రబాబు అర్జెంటుగా కాదందరికి న్యాయం చేసేస్తారంట. ఆమెను అడ్డుపెట్టుకుని పారిశశ్రామిక వేత్తలను బ్యూరోక్రాట్లను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఏది ఏమైనా నాడు ఓ సినీనటి నేడు ఈ మహానటి. చంద్రబాబు రాజకీయ జీవితం వీళ్లతోనే ముడిపడి ఉంది. ప్రజలపై చంద్రబాబు హనీట్రాప్‌ విసిరిన వేళ కాదంబరి జత్వానీ అలియాస్‌ కిలాడీ కాదంబరి జత్వానీకి తాను కూడా ఓ బాధితుడినేంటూ కుక్కల విద్యాసాగర్‌ ముందుకు వచ్చారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, కేవలం తనకు న్యాయం కావాలని కోరుతూ మీడియా ముందుకు వచ్చినట్లు చెబుతున్న విద్యాసాగర్‌తో సాక్షి ప్రతినిధి ఇంటర్వ్యూ. సాక్షి ఇంటర్వ్యూలో కాదంబరి జత్వానీ.. కుక్కల విద్యాసాగర్‌ని ఎలా మోసం చేసిందో తెలుసుకుందాం.

సాక్షి: కాదంబరి జత్వానీ మీకు ఎక్కడ? ఎప్పుడు? ఎలా? పరిచయం అయ్యింది

కుక్కల విద్యాసాగర్‌ : 2009లో నేను వ్యాపార వేత్తను.నేను చేస్తున్న వ్యాపారం బాగా జరిగేది. ఆ సమయంలో నాకు ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయం అయిన కాదంబరి ట్రాప్‌లో చిక్కుకున్నాను. ఫ్రెండ్‌ ద్వారా పరిచయం అయ్యింది. అప్పటి నుంచి నాతో పరిచయం పెంచుకోవడం. అవసరానికి డబ్బులు అడిగేది.

సాక్షి : మీరు ట్రాప్‌లో పడ్డాను అని అంటున్నారు? ఆమె ట్రాప్‌లో పడ్డాను అన్న విషయం మీకు ఎప్పుడు? ఎలా తెలిసింది? 
  
విద్యాసాగర్‌ : కొన్నేళ్ల తర్వాత తెలిసింది. నా ‍వ్యాపారం నిమిత్తం ముంబైలో సెటిల్‌ అయ్యాను. 2014 నుంచి కాదంబరి,ఆమె తల్లి నాకు సమయం, సందర్భం లేకుండా డబ్బులు కావాలని బెదిరించే వారు. అన్ని లక్షలు కావాలి. ఇన్ని లక్షలు కావాలి అని ఓ పది, పదేహేను నెంబర్ల నుంచి ఫోన్‌ చేసేవారు. స్పందించపోతే.. నేను నీ గురించి అందరికి చెబుతాను అని బ్లాక్‌ మెయిల్‌ చేసేది. చెప్పుకోలేని విధంగా చిత్రహింసలకు గురి చేసేది.

సాక్షి: బ్లాక్‌ మెయిల్‌ అంటే? ఏ విధమైన బ్లాక్‌మెయిల్‌. మీకు సంబంధించిన విషయాలు ఆమె దగ్గర ఏమున్నాయి? ఆమెకు భయపడాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది?

విద్యాసాగర్‌: వ్యక్తిగత విషయాలు ఏమీలేవు. మీకు చెప్పాను కదా హైదరాబాద్‌లో బిజినెస్‌ చేసే సమయంలో ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయం అయిన కాదాంబరిని అప్పుడప్పుడు కలిసే వాడిని. అలా కలిసినప్పుడు నాతో సెల్ఫీలు దిగింది. ఆ సెల్ఫీలను మార్ఫ్‌ చేసింది. ఆ ఫొటోల్ని నా తల్లిదండ్రులకు చూపిస్తా అని బెదిరించేది. లక్షలు కావాలి. కోట్లు కావాలి అని అడిగేది. సడెన్‌గా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేది. సమయం, సందర్భం లేకుండా నా ఇంటి దగ్గర కారు అపేది. అక్కడికి వచ్చి నాకు డబ్బులు కావాలనే ఫోన్‌ చేసి విసిగించేది.

సాక్షి: అంటే ఆమెతో ఫొటోలు దిగడం మీకు చుట్టుకుంది’అని కోవాలా?

విద్యాసాగర్‌ : అవును

సాక్షి : ఫొటోలు మార్ఫింగ్‌ అంటున్నారు. రెండు మూడు రోజుల నుంచి ఎల్లో మీడియాలో కొన్ని అర్ధనగ్న ఫోటోలు ప్రసారం అవుతున్నాయి. ఆమె కూడా చూపించింది. ఆ ఫొటోలు మీవేనా?అలాంటి ఫొటోలు మీవి ఆమె దగ్గర ఉన్నాయా?

విద్యాసాగర్‌ : లేవు.అవన్ని మార్ఫ్‌ చేసినవే. అలా ఫొటోల్ని మార్ఫ్‌ చేయడం ఆమెకు అలవాటు. అలవాటు ప్రకారం నా ఫొటొల్ని మార్ఫ్‌ చేసింది. వాటిని చూపించి బెదిరించేది.

సాక్షి : ఆ ఫొటోలు మీవి కావని అంటున్నారు. ఆ ఫొటోలు మీవి కావు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా?

విద్యాసాగర్‌ : ఎస్‌. ఆ ఫొటోలు నావి కావు. మార్ఫ్‌ చేసినవే. కావాలంటే ఫోరెన్సిక్‌ పరీక్ష చేయండి. పైగా నేనెప్పుడూ ఆరోగ్యంగా బొద్దుగా ఉండేవాడి. ఆ ఫొటోల్లో చూపించినట్లుగా నాకు కండలు లేవు. నాకు జిమ్‌ చేసే అలవాటు లేదు.

సాక్షి: మిమ్మల్ని బెదిరింది ఏం కావాలని డిమాండ్‌ చేసేవారు.

విద్యాసాగర్‌ : డబ్బులు,ఫ్లైట్‌ టికెట్‌లు,హోటెల్‌ బుకింగ్స్‌,షాపింగ్‌ కోసం ఎక్కువ శాతం డబ్బులు అడిగేవారు.

సాక్షి : మీలాగే బాధితులు చాలా మంది ఉన్నారని మీకు ఇప్పుడే తెలిసిందా? లేదంటే గతంలోనే తెలిసిందా?

విద్యాసాగర్‌ : నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది

సాక్షి : ఈ మధ్యనే తెలిసిందని అంటున్నారు. మీలాగే చాలామందిని ఇబ్బంది పెట్టింది అంటున్నారు. హనీట్రాప్‌,బ్లాక్‌ మెయిల్‌ చేసిందని చెప్పేందుకు మీ వద్ద ఆధారాలు ఏమైనా ఉన్నాయా?

విద్యాసాగర్‌ : 10ఏళ్లుగా నేను డాక్టర్‌ని అని చెబుతున్న జత్వానీ.. ఏ ఒక్క పేషెంట్‌కైనా ట్రీట్మెంట్‌ ఇచ్చిందో చెప్పమనండి. ఏ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేసేందో అడగండి. దీంతో పాటు అమెరికాలోని డ్రెక్సెల్ యూనివర్సిటీ ఇంటర్నల్‌ మెడిసిన్‌లో నేను డాక్టర్‌ని అని చెప్పుకుని తిరుగుతుంది.పాస్‌పోర్ట్‌లు, డేటాబర్త్‌ సర్టిఫెట్‌లు చెక్‌ చేయండి. సమాజానికి నేను బాగా చదివాను.డాక్టర్‌ని అని ఒక హైప్‌ క్రియేట్‌ చేసింది. ప్రముఖులతో కూడా ఇలాగే చెప్పుకునేవారు. వాళ్లు కూడా నమ్మేవారు. నేను రెండు సార్లో, మూడు సార్లో ఆమెతో మాట్లాడాను. నాలుగో సారి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది.

సాక్షి : మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగారా?

విద్యాసాగర్‌ : జత్వానీ, ఆమె తల్లి ఇద్దరు ఫోన్‌ చేసి అడిగారు. మా అమ్మాయిని పెళ్లి చేసుకో అని. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement