వివాహేతర సంబంధం.. ప్రైవేటు ఫోటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని.. | Man Suicide Due To Honey Trap Karnataka | Sakshi
Sakshi News home page

Karnataka: వివాహేతర సంబంధం.. ప్రైవేటు ఫోటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని..

Published Tue, May 17 2022 6:44 AM | Last Updated on Tue, May 17 2022 8:20 AM

Man Suicide Due To Honey Trap Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యశవంతపుర(బెంగళూరు): బెంగళూరు హేరోహళ్లి వార్డు బీజేపీ నాయకుడు అనంతరాజు (46) ఈ నెల 12న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం వల్ల  ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే డెత్‌నోట్‌ సోమవారం దొరకడంతో హనీ ట్రాప్‌ అని బయటపడింది. ఓ మహిళ అక్రమ సంబంధం కారణంగా ఆమె తమ ప్రైవేటు ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడిందని, దీనివల్ల ఆత్మహత్య చేసుకొంటున్నట్లు అనంతరాజు అందులో రాశాడు. ఆమె వలలో చిక్కుకొని మోసం చేశానంటూ భార్యకు క్షమాపణలు చెప్పాడు.

కేఆర్‌ పురకు చెందిన రేఖా అనే మహిళతో ఫేస్‌బుక్‌ ద్వారా అనంతరాజుకు పరిచయమైంది. తరువాత ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను చూపి ఆమె అనంతరాజును బ్లాక్‌మెయిల్‌ చేయసాగింది. అప్పుడప్పుడు అడిగినంత డబ్బును ఆమెకు ఇచ్చాడు. రోజురోజుకూ ఆమె నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఇంట్లో చెప్పుకోలేక తీవ్రంగా మథనపడ్డాడు. ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

చదవండి: 22 లక్షలతో పారిపోయి.. కోర్టులో లొంగిపోయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement