యశవంతపుర(బెంగళూరు): ఆర్‌ఆర్ నగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి మునిరత్న హనీట్రాప్‌నకు పాల్పడేవారని బీబీఎంపీ మాజీ కార్పొరేటర్ వేలు నాయ్కర్ ఆరోపించారు. ఆదివారం తన మద్దతుదారులతో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ... మునిరత్న హనీట్రాప్ చేసి బెదిరించడం పనిగా పెట్టుకున్నట్లు ఆరోపించారు.
జేపీ పార్క్, డాలర్స్‌కాలనీలో దీని కోసం స్టూడియో ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. 2023 ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలనే విషయమై మునిరత్నను అడిగాం. అప్పుడు నీది ఈస్ట్‌మన్ కలర్ పిక్చర్ ఉంది చూపించాలా, లేక నోరు మూసుకొని పని చేస్తారా అని బెదిరించినట్లు వేలు నాయ్కర్ ఆరోపించారు. నిర్మాతగా మునిరత్న చేసిన మొదటి సినిమా అంటీ ప్రీత్సే. ఆయన మంత్రి అయిన తరువాత అందరూ అంటీలే ఆయన వెంట ఉండేవారని హేళన చేశారు.
నాపై కుట్రలు: మునిరత్న
ఆర్‌ఆర్ నగరను దక్కించుకోవడానికి కొందరు చేస్తున్న కుట్రలని మాజీ మంత్రి మునిరత్న అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పరోక్షంగా డీకే శివకుమార్ బ్రదర్స్‌పై నిప్పులు పోశారు. వేలు నాయక్కర్ చేసిన వ్యాఖ్యలు అతడివి కాదు. చెప్పిస్తున్న మాటలని డీకేశి బ్రదర్స్‌పై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment