బాలీవుడ్‌లో హనీట్రాప్ వ్యవహారం సంచలనంగా మారింది. ఏకంగా 100 మంది సెలబ్రిటీల నగ్నవీడియోలు రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగారు సైబర్ నేరగాళ్లు. సెలబ్రెటీల ఫిర్యాదులతో ముంబై సైబర్‌క్రైమ్ పోలీసులు ఓ ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోల్లో బాలీవుడ్‌కు చెందిన 100 మంది సినీ, టీవీ నటులు ఉన్నారు. నిందితుల్లో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు సైన్స్ గ్రాడ్యుయేట్స్ కాగా ఒకరు మైనర్. వీరి నుంచి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్‌లు, 12 నకిలీ ఖాతాలు, ఇతర ఎలక్ట్రరానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల్లో టాప్ సెలబ్రిటీలతో పాటు మోడల్స్, రిచ్ వుమెన్, మెన్ ఉన్నారని ముంబై పోలీసులు తెలిపారు.
(చదవండి: ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ)
నమ్మించి, ఆపై నగ్న వీడియోలు
నిందితులు మొదటగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌ల ద్వారా సెలబ్రిటీలతో స్నేహం చేస్తారు. డాక్టర్, లాయర్, బిజినెస్‌మెన్ అని చెప్పి వారిని నమ్మిస్తారు. మెల్లిగా వీడియో కాల్స్ చేసి క్లోజ్ అవుతారు. నమ్మకం కుదిరాక నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడి.. రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్‌కు దిగుతారు. డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆ తర్వాత ఈ వీడియోలను డార్క్‌వెబ్ వంటి ఫోర్న్ సైట్లకు అమ్ముతారు. అపరిచితులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చెయ్యొద్దని పోలీసులు హెచ్చరించారు.
(చదవండి: KGF Chapter 2: సౌత్ శాటిలైట్ రేట్స్ కొనుగోలు చేసిందెవరంటే..)
Comments
Please login to add a commentAdd a comment