సాక్షి, హైదరాబాద్: కిడ్నీ ఆపరేషన్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో 8 మంది బ్రోకర్లను పోలీసులు గుర్తించారు. 6 నెలల నుంచి అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి వ్యవహారం జరుగుతోంది. బెంగళూరుకి చెందిన డాక్టర్‌దే కీలకపాత్రగా పోలీసులు తేల్చారు. బెంగళూరు, చెన్నైకి చెందిన బ్రోకర్లే కిడ్నీల మార్పిడిలో సూత్రధారులుగా పోలీసులు నిర్థారించారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.55 లక్షలు డాక్టర్ తీసుకున్నాడు.
చెన్నై నుంచి ఇద్దరు మహిళలను తీసుకొచ్చి ఆపరేషన్ చేసిన వైద్యుడు.. బెంగళూరుకి చెందిన లాయర్, నర్స్‌కి కిడ్నీ మార్పిడి చేశాడు. కిడ్నీ మార్పిడికి డాక్టర్‌కి లాయర్ రూ.55 లక్షలు ఇవ్వగా, నర్స్ రూ.45 లక్షలు ఇచ్చింది. చెన్నైకి చెందిన భాను, ఫిరోజ్జ భానులను కిడ్నీ డోనర్స్‌గా పోలీసులు గుర్తించారు. కిడ్నీ డోనర్లకు రూ.5 లక్షలు చొప్పున నగదు చెల్లించారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి డాక్టర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సాధారణ వైద్య చికిత్సలకు (జనరల్) మాత్రమే అనుమతి తీసుకుని ఏకంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేస్తూ రూ.లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్న ఆస్పత్రి నిర్వాకాన్ని వైద్యాధికారులు, పోలీసులు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి డాక్టర్స్ కాలనీలోని అలకనంద ఆస్పత్రిలో అనుమతుల్లేకుండా కిడ్నీల మారి్పడి దందా సాగిస్తున్నన్నట్లు సమాచారం అందింది. దీంతో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎల్‌బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి ఆస్పత్రిపై దాడి చేశారు.
ఇదీ చదవండి: భార్యను చంపి, ముక్కలు చేసి.. కుక్కర్‌లో ఉడికించి..
జనరల్, ప్లాస్టిక్ సర్జరీల నిమిత్తం ఆస్పత్రి నిర్వహణకు 6 నెలల అనుమతి తీసుకున్న సుమంత్ అనే వ్యక్తి.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమాయక యువతులకు డబ్బు ఆశ చూపి కిడ్నీలు దానం చేసేందుకు ఒప్పిస్తున్నాడు. హైదరాబాద్‌లో అవసరమైన వారికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయిస్తున్నాడు. ఇవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండానే చేస్తున్నట్లు గుర్తించిన జిల్లా వైద్యాధికారులు.. పోలీసులతో కలిసి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఇద్దరు కిడ్నీ దాతలతో పాటు ఇద్దరు కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులను కనుగొన్నారు.
అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలుసుకొని వైద్యులు పరారయ్యారు. దీంతో చికిత్స పొందుతున్న నలుగురు బాధితులను అధికారులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలకనంద ఆస్పత్రిని సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment