లక్నో: త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఇండియా కూటమి అభ్యర్ధులకు బేషరతు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నిరంకుశ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి జరుగుతున్నాయని పేర్కొంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆప్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భేషరుతుగా ఇండియా కూటమికి భేషరతుగా మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో మా పాత్ర , ప్రచారం తదితర అంశాలపై కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయిస్తారు’అని ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.
ఇవి సాధారణ ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, నిరంకుశ పాలనను అంతం చేయడం, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మేం యూపీలో కలిసి పనిచేస్తున్నాం. కూటమిలో భాగంగా సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్న చోట మేము వారి కోసం పని చేస్తాము అని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో భారత కూటమి గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ప్రతి కార్యకర్త తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సైతం ఎస్పీ అభ్యర్థుల కోసం పనిచేస్తారని సంజయ్ సింగ్ పునరుద్ఘాటించారు.
ఎన్నికలకు ముందు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌లను జైలుకు పంపినందుకు కేంద్ర ప్రభుత్వంపై యాదవ్ మండిపడ్డారు.ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ ఇలా చేస్తోందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment