న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏకైక లోక్‌సభ సభ్యుడు సుశీల్ కుమార్ రింకూ బీజేపీలో చేరారు. ఎంపీతో పాటు జలంధర్ వెస్ట్ ఎమ్మెల్యే శీతల్ అంగురల్ సైతం బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. సుశీల్‌కుమార్ రింకూ 2023 జలంధర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో సుశీల్ కుమార్ రింకూ అంగురల్ జలంధర్ వెస్ట్ నియోజకవర్గం నుంచి అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి శీతల్ అంగురల్‌పై తలపడ్డారు. విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత జరిగే జలంధర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక రావడంతో కాంగ్రెస్ టికెట్‌ను ఆశించారు. కాంగ్రెస్ అధిష్టానం టికెట్ తిరస్కరించడంతో వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక తాను అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన జలంధర్ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి తన కీలక అనుచరుడు శీతన్ అంగురల్‌కు ఆప్ టికెట్ దక్కేలా చేసి గెలిపించుకున్నారు.
ఈ సందర్భంగా సుశీల్ కుమార్ రింకూ మాట్లాడుతూ... పంజాబ్ అభివృద్ధి కోసం, బీజేపీలో చేరానని, అభివృద్ధి ప్రాజెక్టులను సులభతరం చేయడంలో నిర్లక్ష్యం చేసినందుకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. నాకు అధికారంపై ఆశలేదు. జలంధర్ అభివృద్ధి కోసమే బీజేపీలో చేరినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment