సాక్షి, చండీఘడ్ : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రాజ్ కుమార్ చబ్బెవాల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఆమ్ ఆద్మీలో చేరారు.
పంజాబ్‌లో వారం వ్యవధిలో ఆప్‌లో చేరిన రెండో కాంగ్రెస్ నేత చబ్బేవాల్. బస్సీ పఠానాకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్ జీపీ ఇటీవలే ఆప్‌లో చేరారు.
ఈ సందర్భంగా చబ్బెవాల్‌లో చేరడంతో పార్టీ మరింత బలోపేతం అయ్యిందని ఆప్ రాష్ట్ర యూనిట్ పేర్కొంది. భగవంత్ మాన్ ప్రజానుకూల విధానాలకు ఆకర్షితుడై ఎమ్మెల్యేగా ఉన్న చబ్బెవాల్ ఆప్‌లో చేరినట్లు తెలుస్తోంది. కాగా, హోషియార్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి చబ్బేవాల్‌ను ఆప్ పోటీకి దించవచ్చని వర్గాలు తెలిపాయి.
అంతకుముందు, చబ్బెవాల్ ఎక్స్.కామ్‌లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పోస్ట్ పెట్టిన ఆయన.. అందుకు గల కారణాల్ని వెల్లడించలేదు.
Resigned today from INC and Legislative Assembly Punjab. pic.twitter.com/NhOV784uCU
— Dr. Raj Kumar (@DrRajChabbewal) March 15, 2024
Comments
Please login to add a commentAdd a comment