
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసన మండలిలోని 11 సీట్లకు జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల్లో బీజేపీ 6 సీట్లను కైవసం చేసుకుంది. మొత్తం 11 సీట్లలో బీజేపీ 6, సమాజ్‌వాదీ 3, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో గెలుపొందారు. మొత్తం 100 మంది సభ్యులున్న మండలిలో తాజా ఫలితాలతో బీజేపీ సభ్యుల సంఖ్య 25కు, సమాజ్‌వాదీ పార్టీ సభ్యుల సంఖ్య 55కు పెరిగింది. బహుజన సమాజ్ పార్టీ తమ అభ్యర్థులను నిలపలేదు. తమ పార్టీ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో నలుగురిని బరిలోకి దించగా ముగ్గురు గెలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ తెలిపారు. ఇది చారిత్రక విజయమన్నారు. (చదవండి: ఎమ్మెల్యే హత్య.. వివాదంలో బీజేపీ కీలక నేత)