లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చిన్నాన్న, ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) అధ్యక్షుడు శివపాల్ యాదవ్ శనివారం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లట్విట్టర్ అకౌంట్లను ఫాలో అవుతున్నారు. దీంతో ఎస్పీ నేతృత్వంలోని విపక్ష కూటమికి బీటలు వారుతున్నాయన్న వార్తలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలో అఖిలేశ్ శనివారం తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు.
మార్చి 26న జరిగిన ఎస్పీ కొత్త ఎమ్మెల్యేల భేటీకి శివపాల్‌ను అఖిలేశ్ ఆహ్వానించలేదు. వారం క్రితం జరిగిన ప్రతిపక్ష కూటమి సమావేశానికి శివపాల్ హాజరుకాలేదు. తర్వాత సీఎం యోగితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దాంతో శివపాల్ బీజేపీ కూటమిలో చేరతారని వదంతులు ఎక్కువయ్యాయి. శివపాల్‌కు రాజ్యసభ సీటు, ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment