
లక్నో: లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీ పక్షనేతగా అఖిలేశ్ యాదవ్ వ్యవహరిస్తారు. ఆ పార్టీ ఎంపీలు ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకోనున్నారు. అఖిలేశ్ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆ పదవికి రాజీనామా చేయనున్నారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం, లోక్‌సభ ప్రొటెం స్పీకర్ ఎన్నిక తర్వాత తమ పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడిగా అఖిలేశ్ యాదవ్‌ను లాంఛనంగా ఎన్నుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత రాజేంద్ర చౌదరి శనివారం చెప్పారు. అఖిలేశ్ ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment