దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఆరవ దశ పోలింగ్ ముగిసింది. ఇంకా ఒక దశ అంటే ఏడవ దశ ఓటింగ్ మాత్రమే మిగిలివుంది. అయితే ఇప్పటికీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయం వెల్లడికాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే కవీంద్ర చౌదరి దీనికి సమాధానమిచ్చారు.
మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నికలని పేర్కొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి అయిన కవీంద్ర చౌదరి.. ఈసారి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, అన్ని మతాలు, కులాల వారు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఓటర్లపై దాడులకు దిగారని, దీనిపై జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశామని అన్నారు. బీజేపీకి 147 కంటే తక్కువ సీట్లు వస్తాయని, ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని కవీంద్ర చౌదరి జోస్యం చెప్పారు.
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయాన్ని ప్రస్తావించిన ఆయన సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలో చదువుకున్నారని, ఆయనకు ప్రభుత్వాన్ని నడపడంలో అనుభవం ఉన్నందున ఆయనే ప్రధాని అయ్యేందుకు అర్హత కలిగిన అభ్యర్థి అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment