Suitable
-
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఆరవ దశ పోలింగ్ ముగిసింది. ఇంకా ఒక దశ అంటే ఏడవ దశ ఓటింగ్ మాత్రమే మిగిలివుంది. అయితే ఇప్పటికీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయం వెల్లడికాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే కవీంద్ర చౌదరి దీనికి సమాధానమిచ్చారు.మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నికలని పేర్కొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి అయిన కవీంద్ర చౌదరి.. ఈసారి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, అన్ని మతాలు, కులాల వారు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఓటర్లపై దాడులకు దిగారని, దీనిపై జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశామని అన్నారు. బీజేపీకి 147 కంటే తక్కువ సీట్లు వస్తాయని, ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని కవీంద్ర చౌదరి జోస్యం చెప్పారు.ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయాన్ని ప్రస్తావించిన ఆయన సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలో చదువుకున్నారని, ఆయనకు ప్రభుత్వాన్ని నడపడంలో అనుభవం ఉన్నందున ఆయనే ప్రధాని అయ్యేందుకు అర్హత కలిగిన అభ్యర్థి అని పేర్కొన్నారు. -
విద్యుత్ ప్లాంట్లకు అనువుగా రామగుండం
10,000 మెగావాట్ల ప్రాజెక్టుగా స్థాపనకు అనుకూలం ఎన్టీపీసీ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి జ్యోతినగర్ (కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎన్టీపీసీల్లోకెల్లా అతిపెద్ద ప్రాజెక్టుగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ అరూప్‌రాయ్ చౌదరి అన్నారు. రామగుండంలో తెలంగాణ స్టేజీ-1 కింద చేపట్టనున్న 8, 9 యూనిట్ల(2+800=1,600 మెగావాట్లు) విద్యుత్ కేంద్రం స్థలాన్ని, మ్యాపును ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టులోని ఏడో యూనిట్‌ను సందర్శించి విద్యుత్ ఉత్పాదకతపై అధికారులతో చర్చించారు. అనంతరం ఎన్టీపీసీ డెరైక్టర్ (హెచ్ఆర్) యూపీ ఫణి, డెరైక్టర్(టెక్నికల్) కేకే శర్మలతో కలిసి అరూప్‌రాయ్ చౌదరి సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎన్టీపీసీ, జాయింట్ వెంచర్స్‌తో కలిపి 40 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. వీటిలో 4,260 మెగావాట్ల అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మధ్యప్రదేశ్‌లోని వింధ్యాచల్ ఉందన్నారు. దానికంటే రామగుండం ప్రాజెక్టులో 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను నెలకొల్పడానికి అనుకూలంగా ఉందని వెల్లడించారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అనువైన వనరులు బొగ్గు, నీరు, స్థలం అందుబాటులో ఉన్నాయన్నారు. రామగుండంను అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రూపొందించడానికి ఎన్టీపీసీ ముందుందని, స్థానిక ప్రజలు, సంస్థ ఉద్యోగుల కృషితో అది సాధ్యమవుతుందని తెలిపారు. యాష్‌పాండ్ కోసం సింగరేణి సంస్థతో మాట్లాడి జీవితకాలం పూర్తవుతున్న ఓసీపీ ప్రాజెక్టులను యాష్పాండ్గా వినియోగించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లోని కంటిన్యూయస్ ఎమిషన్ మానిటరింగ్ సిస్టం(సీఈఎంసీ)ని, కోల్ టెస్టింగ్ లాబొరేటరీని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ గ్రూప్ ఆఫ్ జనరల్ మేనేజర్ ప్రశాంత్‌కుమార్ మహాపాత్ర, జనరల్ మేనేజర్లు రాంకుభేర్, రాజన్, భావరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రాజధానికి కర్నూలు అనుకూలం
సాక్షి, కర్నూలు : రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎంపిక ప్రక్రియ మొదలైంది. అనువైన నగరాన్ని గుర్తించేందుకు శివరామకృష్ణన్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. ఇటీవలే సీమ ముఖద్వారమైన కర్నూలులోనూ పర్యటించింది. నగరంలో విద్య, వైద్యం, రవాణా, నీటి వసతి, పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని ఇక్కడి ప్రజలు ఆ కమిటీకి నివేదించారు. 1956కు ముందు ఆంధ్రరాష్ట్రానికి తొలి రాజధానిగా కర్నూలు కొనసాగింది. మూడేళ్లపాటు ఆ వైభవాన్ని అనుభవించి పెద్ద మనసుతో రాజధానిని త్యాగం చేసింది. ఈ గత చరిత్రతో పాటు ప్రస్తుతం జిల్లాలో లభిస్తున వనరులను పరిశీలిస్తే నిస్సంకోచంగా తిరిగి కర్నూలునే రాజధానిగా ప్రకటించాలని నిపుణలు డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన రవాణ మార్గం రాయలసీమకు ముఖద్వారం కావడంతో రోడ్డు, రైలు మార్గాలు మెరుగ్గా ఉన్నాయి. వీటిని మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాలూ ఉన్నాయి. కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లులో విమానాశ్రయం ఏర్పాటుకు అనువుగా స్థలం ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ గుర్తించింది. కర్నూలు నగరం నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు గంటల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారి పక్కనే డోన్ రైల్వేజంక్షన్ ఉంది. ఇక్కడినుంచి కర్ణాటక, హైదరాబాద్‌కు రైళ్లు నడుస్తున్నాయి. కర్నూలు నగరం నుంచి సైతం పలు రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. సరకు రవాణా ద్వారా గణనీయంగా ఆదాయం అర్జిస్తున్న డివిజన్ ఇది. కర్నూలు-నందికొట్కూరు, ఆత్మకూరు మీదుగా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చేరుకునేందుకు బస్సు మార్గం ఉంది. దీని ద్వారా కోస్తాను అనుసంధానించవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి అనువైన ప్రాంతం.. జిల్లాలో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధికి అనువైన ప్రదేశం. ఇక్కడ 40కిపైగా ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ఈ తరుణంలో సాఫ్ట్వేర్ రంగాన్ని ప్రోత్సహిస్తే పెద్ద కంపెనీలు ఇక్కడే కార్యకలాపాలు సాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయానికి నెలవు .. ఇక్కడ అన్ని రకాల పంటలు పండిస్తారు. ధాన్యాగారంగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన జిల్లాల్లో మన జిల్లా ఒకటి. ఏటా ఐదు లక్షల ఎకరాలకుపైగా వరి సాగు చేస్తున్నారు. కర్నూలు సోనాకు ఓ ప్రత్యేకత ఉంది.