లక్నో: త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజీపీని ఓడించాలంటే విపక్షాలు ఐక్యంగా పోరాడటమొక్కటే మార్గమన్నారు సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. ఈ సందర్బంగా ఐక్య ప్రతిపక్ష కూటమి విధానాలపై తమ పార్టీ ధృక్కోణాన్ని వివరిస్తూ 80 మందిని ఓడించి, బీజేపీని తరిమికొట్టండని నినదించారు.
2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దారుణ ఓటమి తప్పదని.. బీసీలు, దళితులు, మైనారిటీలే బీజీపీని ఓడిస్తారన్నారు అఖిలేష్ యాదవ్. ఈసారి ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి మా దగ్గరొక ఫార్ములా ఉంది. ఐక్య ప్రతిపక్ష కూటమి నుండి పెద్ద జాతీయ పార్టీలు మాకు మద్దతిస్తే 80 మంది బీజేపీ ఎంపిలను ఓడిస్తాం.. బీజేపీని తరిమికొడతాం. అందుకే యూపీలో "80 గెలుద్దాం, బీజేపీని తరిమేద్దాం.." అన్న నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నామని అన్నారు.
బీజేపీయేతర పార్టీలన్నీ ఐక్యంగా పోరాడాలన్న సంకల్పంతో ఐక్య ప్రతిపక్ష కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే సమాజ్ వాది పార్టీ గతంలో కూడా కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకున్న ప్రస్తావన తీసుకురాగా తామెప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకున్నా నిజాయతీగానే వ్యవహరించామని ఎప్పుడూ సీట్ల కోసం పట్టుబట్టలేదని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: ఆ అధికారం వారికి లేదు: వెంకయ్య నాయుడు
Comments
Please login to add a commentAdd a comment