లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజు (శనివారం) వెలువడనున్నాయి. నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు
యూపీలోని మీరాపూర్, కుందర్కి, సీసామవు, కటేహరి, ఫుల్పూర్, మజ్వాన్, ఘజియాబాద్, కర్హల్, ఖైర్ స్థానాలకు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), దాని రాజకీయ ప్రత్యర్థుల మధ్య నెలకొన్న ఈ పోటీని 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు.
उप्र के विधानसभा उपचुनाव में चुनाव आयोग व इंडिया गठबंधन-सपा के सभी 9 सीटों के उम्मीदवारों से ये अपील है कि कल सुबह ये सुनिश्चित करें कि नियमानुसार पोस्टल बैलेट पहले गिने जाएं और फिर ईवीएम मशीनों के वोटों की मतगणना हो। सभी पूरी तरह मुस्तैद रहें और किसी भी तरह की गड़बड़ी होने या…
— Akhilesh Yadav (@yadavakhilesh) November 22, 2024
ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వస్తాయని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన ఒక ట్వీట్‌లో.. ఎన్నికల కమిషన్‌కు, ఇండియా అలయన్స్-ఎస్‌పీకి చెందిన తొమ్మిదిమంది అభ్యర్థులకు కొన్ని సూచనలు చేశారు. శనివారం ఉదయం జరిగే పోస్టల్ బ్యాలెట్‌లను నిబంధనల ప్రకారం మొదట లెక్కించేలా చూసుకోవాలని సూచించారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే ఎన్నికల కమిషన్‌కు, పార్టీకి తెలియజేయాలని సూచించారు. అభ్యర్థులు విజయ ధృవీకరణ పత్రాన్ని అందుకునేవరకూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఫుల్‌పూర్, ఘజియాబాద్, మజ్వాన్, ఖైర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. సీసామవు, కటేహరి, కర్హల్, కుందర్కిలో ఎస్పీ విజయం సాధించింది. అప్పుడు ఎస్పీకి మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ), మీరాపూర్ స్థానాన్ని గెలుచుకుంది. ఆ పార్టీ ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో భాగమైంది. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయలేదు. ఎస్పీకి మద్దతు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment