రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య, సమాజ్‌వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్ మెయిన్‌పురిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అఖిలేష్, డింపుల్‌ల కుమార్తె అదితి యాదవ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్‌కు సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ టిక్కెట్ కేటాయించింది.
ములాయం సింగ్ యాదవ్ వారసత్వాన్ని కాపాడే బాధ్యత ఇప్పుడు డింపుల్ తీసుకున్నారు. ఈ ప్రాంత ప్రజలు ములాయం సింగ్‌ను ‘దాదా’ అని పిలిచేవారు. మెయిన్‌పురి సీటు 1996 నుంచి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. మెయిన్‌పురిలో డింపుల్ యాదవ్‌తో కలిసి అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్ కనిపించారు. సమాజ్‌వాదీ పార్టీ డింపుల్ యాదవ్‌కు మెయిన్‌పురి స్థానం నుంచి మరోమారు పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది.
ములాయం సింగ్ మరణానంతరం డింపుల్ ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు డింపుల్ గెలుపు అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు. యూపీలో నూతన రామాలయం ప్రారంభమైన నేపధ్యంలో ఇది సమాజ్‌వాదీ పార్టీ ఓటు బ్యాంకును తగ్గిస్తుందని పలువురు అంటున్నారు. ములాయంను తొలిసారిగా పార్లమెంటుకు పంపిన ఘనత మెయిన్‌పురి ప్రజలకే దక్కుతుంది. అప్పటి నుంచి ఈ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు గెలుస్తూనే ఉన్నారు. తేజ్ ప్రతాప్, ధర్మేంద్ర యాదవ్ కూడా ఈ స్థానం నుంచే పార్లమెంటు సభ్యులయ్యారు.
2011 జనాభా లెక్కల ప్రకారం మెయిన్‌పురి జిల్లాలో 93.48 శాతం హిందూ జనాభా ఉంది. ఇక్కడ యాదవుల ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. 2019లో ఇక్కడ 17.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. యూపీలో ముస్లిం, యాదవ్ వర్గాలను సమాజ్‌వాదీ పార్టీ సంప్రదాయ ఓటర్లుగా పరిగణిస్తారు. ఇక్కడ ముస్లిం ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. యాదవుల ఓటు బ్యాంకుకు తోడు ములాయం సింగ్ ప్రభావం కారణంగా సమాజ్ వాదీ పార్టీ రెండు దశాబ్దాలుగా ఈ స్థానంలో తన హవా చాటుతోంది.
Comments
Please login to add a commentAdd a comment