ఉత్తరప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఓ యువకుడు సరదాగా కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డ వరుడు మృతిచెందాడు. ఈ ఘటన యూపీ, లఖిమ్‌పూర్ ఖేరీ జిల్లా రామ్‌పూర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సునీల్ వర్మ (25), రూబీ వర్మని హిందూ సంప్రదాయంలో ఆదివారం వివాహం చేసుకోవాల్సి ఉంది.