నూరేళ్లు కలిసున్నారు.. కలిసే వెళ్లిపోయారు! | Lived and died together after 100 years of marriage | Sakshi
Sakshi News home page

నూరేళ్లు కలిసున్నారు.. కలిసే వెళ్లిపోయారు!

Published Tue, May 5 2015 4:17 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

Lived and died together after 100 years of marriage

లఖీం పురా: ప్రాణంలో ప్రాణంగా.. శ్వాసలో శ్వాసగా  దాదాపు నూరేళ్లు కలిసి బతికిన ఓ జంట, మరణంలోనూ  తోడుగానే ఉంటామంటూ ఈ లోకాన్ని వీడడంతో గ్రామస్తులంతా కన్నీరు మున్నీరయ్యారు. కులమతాలకతీతంగా గ్రామస్తులంతా ఏకమై  ఆ అరుదైన జంటకు చాలా గౌరవమైన, ఘనమైన వీడ్కోలు పలికారు.


లక్ష్మీపూర్ ఖేరి గ్రామానికి చెందిన రాధిక, ఫకీరా  దాదాపు నూరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇపుడు  వారి వయస్సు ఒకరికి 107, మరొకరికి  103 . నిండు నూరేళ్ల సావాసంలా  దాదాపు వందేళ్ల వైవాహిక జీవితాన్ని సాగించిన ఆ జంట శనివారం మరణించారు. భార్య రాధిక గుండెపోటుతో మరణించడడంతో.. తట్టుకోలేని భర్త ఫకీరా కూడా తుదిశ్వాస విడిచాడు.  దీంతో ఆ  శతాధిక వృద్ధ దంపతుల దహన సంస్కారాలను  గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement