రేవంత్ రెడ్డి (ఫైల్)
హైదరాబాద్: రైతులను నాశనం చేసినవాళ్లు.. రాజకీయంగా ఎదిగినట్లు చరిత్రలో లేదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికార దాహంతో నలుగురు రైతులను కేంద్రమంత్రి కొడుకు పొట్టన బెట్టుకున్నాడని విమర్శించారు. అజయ్ మిశ్రా మాటల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఉన్నారని తెలిపారు.
అజయ్ మిశ్రాను అరెస్టు చేయడంలో యోగి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. చనిపోయిన రైతు కుటుంబాల పక్షాన దేశమంతా నిలబడాల్సిన తరుణంలో.. యోగి సర్కారు దీనికి భిన్నంగా.. రైతులను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీపై కర్కశంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అజయ్ మిశ్రాను మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
శాంతి యుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై మోడీ, అమిత్‌షాలు మరణ శాసనం చేస్తే.. అజయ్ మిశ్రా ఆయన కొడుకు అమలు చేశారని మండిపడ్డారు. యూపీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని అన్నారు. చనిపోయిన రైతు కుటుంబాల కుటుంబానికి లక్ష చోప్పున ఆర్థిక సహయం అందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment