
బుల్లెట్ తాకడంతో విలవిల్లాడుతున్న వరుడు సునీల్
లక్నో, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఓ యువకుడు సరదాగా కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డ వరుడు మృతిచెందాడు. ఈ ఘటన యూపీ, లఖిమ్‌పూర్ ఖేరీ జిల్లా రామ్‌పూర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సునీల్ వర్మ (25), రూబీ వర్మని హిందూ సంప్రదాయంలో ఆదివారం వివాహం చేసుకోవాల్సి ఉంది.
వధువు ఇంటికి వరుడి బంధువులు వచ్చారు. మరికాసేపట్లో పెళ్లనగా వరుడు సునీల్ వర్మ బంధువు మద్యం మత్తులో సరాదాగా కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. పెళ్లి పీటలపై కూర్చున్న వరుడి ఛాతిలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. వివాహ వేడుకలో సౌండ్ సిస్టమ్ పెట్టి బంధువులు డ్యాన్స్ చేస్తున్నారు. కానీ పెళ్లి మంటపంలో వరుడి పక్కన ఉన్న వారు వరుడిని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే సునీల్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.
నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు
వరుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని కూడా స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మద్యం మత్తులో తూటా పేల్చడం వల్లే సునీల్ మృతిచెందాడని, ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని నిందితుడు పోలీసులకు వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment