SPY Movie Day 1 Box Office Collections Worldwide, Collects Rs 11.7 Crores - Sakshi
Sakshi News home page

SPY Movie Collections: 'స‍్పై' రచ్చ.. ఫస్ట్ డే అన్ని కోట్ల వసూళ్లు

Published Fri, Jun 30 2023 11:47 AM | Last Updated on Fri, Jun 30 2023 12:12 PM

SPY Movie Day 1 Collection Worldwide - Sakshi

యంగ్ హీరో నిఖిల్.. 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ఇప్పుడు 'స్పై' అనే పాన్ ఇండియా చిత్రాన్ని మరో ప్రయత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. జూన్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. మిశ్రమ స‍్పందన అందుకుంటోంది. అయినాసరే తొలిరోజు వసూళ్లలో రచ్చ చేసింది. హీరో నిఖిల్ అయితే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

'స్పై' కథేంటి?
రీసెర్ట్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)లో జై(నిఖిల్) ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్ లో ఉండగా.. రా చీఫ్ శాస్త్రి ఆదేశాల మేరకు స్వదేశానికి తిరిగొస్తాడు. ఐదేళ్ల క్రితం జోర్డాన్ లో ఖాదిర్ ఖాన్(నితిన్ మెహతా)ని చంపే క్రమంలో ఏజెంట్ సుభాష్ వర్దన్ ప్రాణాలు కోల్పోతాడు. అతడి చావు వెనక రహస్యం తెలుసుకోమని జైకి ఫైల్ అప్పగిస్తారు. ఆ తర్వాత ఏజెంట్ జై ఏం తెలుసుకున్నాడు? చివరకు ఏం జరిగిందనేది మెయిన్ స్టోరీ.

(ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ)

తొలిరోజు వసూళ్లు
'కార్తికేయ 2' సక్సెస్ వల్ల నిఖిల్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా అనేసరికి ప్రేక్షకులు చాలా అంచనాలు పెంచుకున్నారు. కానీ 'స్పై' ఆ విషయంలో ఫెయిలైంది. రొటీన్ రెగ్యులర్ కథతో థియేటర్లలోకి వెళ్లిన ఆడియెన్స్ ని నిరాశపరిచింది. అయినాసరే అడ్వాన్ బుకింగ్స్ చాలా బాగా జరగడంతో తొలిరోజు ఏకంగా రూ.11.7 కోట్లు వసూళ్లని సాధించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ హీరో నిఖిల్ ఓ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

సరికొత్త రికార్డ్
'కార‍్తికేయ 2'తో తొలిరోజు రూ.8.50 కోట్లు సొంతం చేసుకున్న నిఖిల్.. 'స్పై' చిత్రంతో మరో మూడు కోట్లకు పైగా ఎక్కువగా సాధించాడు. తద్వారా తన కెరీర్ లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లని అందుకున్నాడు. తొలిరోజు కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి గానీ ఈ వీకెండ్ గడిస్తే గానీ అసలు సంగతి తెలియదు. అంతవరకు మనం వేచి చూడాల్సిందే.

(ఇదీ చదవండి: 'స్పై' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. వచ్చేది ఆ ఓటీటీలోనే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement