
రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. మరికొద్ది గంటల్లో థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ కూడా పూర్తి కావడంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు.
అయితే రిలీజ్ ముందు రోజు డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో కనిపిస్తారని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టా వేదికగా ప్రభాస్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇది విన్న ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అయితే అతిథి పాత్రల్లో నాని, మృణాల్ ఠాకూర్ కూడా నటించారనే టాక్ వినిపించింది. కానీ దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. మరి, వీళ్లు నటించారా? లేదా? అన్నది తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
"Dulquer Salmaan & Vijay Deverakonda are in the Film" - @nagashwin7 🔥#Prabhas #Kalki2898AD #NagAshwin #AmitabhBachchan #DulquerSalmaan #VijayDeverakonda pic.twitter.com/HbGDVGO3kv
— Ayyo (@AyyoEdits) June 26, 2024