ఓటీటీకి వచ్చేసిన వందకోట్ల సినిమా.. ఎక్కడ చూడాలంటే? | Dulquer Salman Latest Hit Movie Streaming On this Ott From Today | Sakshi
Sakshi News home page

Lucky Baskhar: ఓటీటీకి వచ్చేసిన లక్కీ భాస్కర్.. ఎక్కడ చూడాలంటే?

Published Thu, Nov 28 2024 7:01 AM | Last Updated on Thu, Nov 28 2024 7:01 AM

Dulquer Salman Latest Hit Movie Streaming On this Ott From Today

ఈ ఏడాది దీపావళికి టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. విడుదలైన మూడు సినిమాలు హిట్‌గా నిలిచాయి. శివకార్తికేయన్  అమరన్‌, కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్‌ దివాళీకి విడుదలై బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే వీటిలో అమరన్‌ ఇంకా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

అయితే వీటిలో సూపర్‌ హిట్‌ మూవీ లక్కీ భాస్కర్‌ ఇవాళే ఓటీటీకి వచ్చేసింది. ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. అక్టోబర్‌ 31న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉండనుంది.

అసలు కథేంటంటే..?
ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement