
... మీరు చదివింది నిజమే.. దుల్కర్ సల్మాన్ టీమ్ ఇండియా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు. హీరో క్రికెట్ జట్టు కెప్టెన్ అవడమేంటి? అనుకుంటున్నారా? దుల్కర్ భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనుంది రీల్ లైఫ్‌లో. ఆకాశ్ ఖురానా దర్శకత్వంలో దుల్కర్ నటిస్తోన్న తొలి బాలీవుడ్ చిత్రం ‘కర్వాన్’. ఈ సినిమా తర్వాత అభిషేక్ శర్మ దర్శకత్వంలో మరో హిందీ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు దుల్కర్.
1983లో ఇండియా అందుకున్న తొలి ప్రపంచకప్ నేపథ్యంలో 2008లో అనూజా చౌహాన్ రచించిన ‘ది జోయా ఫ్యాక్టర్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో టీమ్ ఇండియా కెప్టెన్‌గా నటించే అవకాశం దుల్కర్‌కి దక్కింది. సోనమ్ కపూర్ దుల్కర్‌కి జోడీగా నటించనున్నారని బీ టౌన్ టాక్. ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ తాజాగా ‘మహానటి’ చిత్రంలో దివంగత జెమినీ గణేశన్ పాత్రలో నటించిన విషయం తెలిసిం§ó..
Comments
Please login to add a commentAdd a comment