లక్కీ భాస్కర్‌ డేట్‌ ఫిక్స్‌ | Dulquar Salman Luckey Bhaskar 2024 Movie Release Date Out, Deets Inside | Sakshi
Sakshi News home page

Luckey Bhaskar Release Date: లక్కీ భాస్కర్‌ డేట్‌ ఫిక్స్‌

Published Thu, May 30 2024 11:54 AM | Last Updated on Thu, May 30 2024 1:06 PM

Luckey Bhaskar Movie Release Date Out

థియేటర్స్‌లోకి ‘లక్కీ భాస్కర్‌’ వచ్చే సమయం ఖరారైంది. దుల్కర్‌ సల్మాన్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న తాజా పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ఈ సినిమా కొత్త ΄ోస్టర్‌ను కూడా బుధవారం విడుదల చేశారు మేకర్స్‌. 

‘‘1980– 1990 కాలంలో నాటి బొంబాయి (ముంబై) నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఓ సాధారణ బ్యాంకు క్యాషియర్‌ అయిన లక్కీ భాస్కర్‌ అసాధారణ ప్రయణాన్ని ఆసక్తికరంగా చూపిస్తున్నాం. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: నిమిష్‌ రవి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement