సీతారామం సినిమాతో టాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నారు. 'కింగ్ ఆఫ్ కోతా' అంటూ అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా దుల్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోత మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న దుల్కర్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మహిళ అభిమానులు తన పట్ల వ్యవహరించిన తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక మహిళా అభిమాని తనను అనుచితంగా తాకిందని వెల్లడించారు.
(ఇది చదవండి: అలా చేయమని ఒత్తిడి.. డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించా: నటి)
దుల్కర్ మాట్లాడుతూ..'సాధారణంగా అభిమానులు సెలబ్రిటీలకు హాని కలిగించాలని అనుకోరు. కానీ కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తారు. కానీ ఓ సంఘటన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఓ మహిళ తన కాళ్లపై చేతులతో రుద్దింది. ఆమె అలా ఎందుకు చేసిందో తెలియదు. ఆ సమయంలో నాకు చాలా నొప్పిగా అనిపించింది. ఆమె వయసులో నాకన్న చాలా పెద్దది. ఆమె అలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు. అక్కడే వేదికపై చాలా మంది ఉన్నారు.' అని తన అనుభవాన్ని పంచుకున్నారు.
కొందరు తమ చేతులను ఎక్కడ ఉంచుకోవాలో తెలియనప్పుడు ఇలా జరుగుతుందని దుల్కర్ సల్మాన్ అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని తెలిపారు. ఆ సమయంలో ఏం జరుగుతుందోనని ఆశ్చర్యపోయా.. దాని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియలేదంటూ దుల్కర్ పంచుకున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన 'గన్స్ అండ్ గులాబ్స్' ఆగస్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రాజ్‌కుమార్ రావు, పూజా గోర్, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్ నటించిన కింగ్ ఆఫ్ కోత ఆగస్టు 24న థియేటర్లలోకి రానుంది.
(ఇది చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!)
Comments
Please login to add a commentAdd a comment