Mrunal Thakur Interesting Comments On Sita Ramam Sequel In Live Chat, Deets Inside - Sakshi
Sakshi News home page

Mrunal Thakur On Sita Ramam 2: ‘సీతారామం 2’ కోసం వెయిటింగ్‌: మృణాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Mon, Apr 10 2023 3:17 PM | Last Updated on Mon, Apr 10 2023 3:37 PM

Mrunal Thakur Interesting Comments on Sita Ramam Sequel in Live Chat - Sakshi

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఈ మూవీకి వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖులు సీతారామంకు ఫిదా అయ్యారు. ప్రతి ఒక్కరి మనసును తాకిన ఈ అందమైన ప్రేమ కావ్యంపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో అలరించే చిత్రాలివే

అంతటి ఆదరణ పొందిన ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందా? లేదా? అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది.  ఓ ఇంటర్య్వూలో ఈ మూవీకి సీక్వెల్‌కు ప్లాన్‌ చేస్తున్నట్లు డైరెక్టర్‌ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి సందర్భంగా వచ్చినప్పుడల్లా సీతారామం టీంకు మూవీ స్వీకెల్‌పై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల ట్విటర్‌ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిన మృణాల్‌కు సీతారామం సీక్వెల్‌పై ప్రశ్న ఎదురైంది. ఈ చిట్‌చాట్‌లో ఓ అభిమాని ‘సీతా రామంకు’ సీక్వెల్‌ ఉందా? అని మృణాల్‌ను అడిగారు.

చదవండి: భర్త బాటలోనే నిహారిక.. విడాకులపై మెగా డాటర్‌ క్లారిటీ?

ఆ ప్రశ్నకు మృణాల్‌ స్పందిస్తూ.. ‘సీతారామం’ నిజంగా అద్భుతమైన చిత్రం. ఈ సినిమా సీక్వెల్‌ ఉంటుందా? లేదా? అనేది కచ్చితంగా తెలియదు. కానీ, ఈ మూవీ సీక్వెల్‌ ఉంటే బాగుండు అనుకుంటున్నా. దానికి కోసం నేరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని సమాధానం ఇచ్చింది. అలాగే మరో అభిమాని తెలుగులో ఏదైనా డైలాగ్‌ చెప్పాలని కోరగా.. ‘అదిగో మళ్లీ మొదలు..’ అని ‘సీతా రామం’ డైలాగ్‌ చెప్పింది. అంతేకాదు, ఆ సినిమా షూటింగ్‌ సమయంలో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ టీంను మిస్‌ అవుతున్నానంది. ఈ సినిమా సీక్వెల్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు గతంలో తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మృణాల్‌ ట్వీట్‌తో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement