Mrunal Thakur Reacts On Buying House In Hyderabad - Sakshi
Sakshi News home page

Mrunal Thakur : హైదరాబాద్‌లో ఇల్లు కొన్న మృణాల్‌ ఠాకూర్‌? ఆమె ఏమందంటే..

Published Sun, May 21 2023 1:45 PM | Last Updated on Sun, May 21 2023 1:58 PM

Mrunal Thakur Reacts On Buying House In Hyderabad - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తొలి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది మృణాల్. ఈ సినిమా సక్సెస్‌ అనంతరం తెలుగులో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకొని మృణాల్‌ హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కుందనే టాక్‌ వినిపించింది. అవకాశాలను దృష్టిలో ఉంచుకొని కొన్నాళ్ల పాటు ఇక్కడే స్థిరపడాలని డిసైడ్‌ అయ్యిందని, అందుకే లగ్జరీ ఇల్లు కొన్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. తాజాగా ఈ రూమర్స్‌పై స్పందించింది మృణాల్‌ ఠాకూర్‌.

అడ్రస్‌ చెప్తే నేను కూడా వచ్చి నా ఇంటిని చూసొస్తా అంటూ ఫన్నీగా బదులిచ్చింది. అయితే హైదరాబాద్‌ లాంటి ప్లేస్‌లో ఎవరికి మాత్రం సెటిల్‌ అవ్వాలని ఉండదు అంటూ తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఇల్లు తీసుకోకపోయినా భవిష్యత్తులో తప్పకుండా కొనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పకనే చెప్పింది మృణాల్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement