These Two Heroes Missed Sita Ramam Movie - Sakshi
Sakshi News home page

Sita Ramam Movie: 'సీతారామం'ను చేజార్చుకున్న స్టార్స్‌ వీళ్లే..

Published Wed, Aug 17 2022 9:26 PM | Last Updated on Thu, Aug 18 2022 9:03 AM

These Two Heroes Missed Sita Ramam Movie - Sakshi

తెలుగు సినిమాలకు ఆగస్టు శుభారంభం పలికింది. బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఇందులో సీతారామం సినిమా విషయానికి వస్తే ఇందులో దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించారు. రష్మిక మందన్నా, సుమంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విజయవంతం కావడంతో తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు దుల్కర్‌.

కానీ సీతారామం సినిమా దుల్కర్‌ కంటే ముందు ఇద్దరు, ముగ్గురు హీరోల దగ్గరకు వెళ్లిందంటూ ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. మొదట ఈ స్క్రిప్ట్‌ను విజయ్‌ దేవరకొండకు వినిపిస్తే అతడికి పెద్దగా నచ్చలేదని హను రాఘవపూడి ఒకానొక సందర్భంలో వెల్లడించాడు. అయితే రౌడీ హీరో కాకుండా మరో ఇద్దరు హీరోలు కూడా సీతారామం చిత్రాన్ని రిజెక్ట్‌ చేశాడట. వాళ్లు మరెవరో కాదు.. నాని, రామ్‌ పోతినేని. ఇద్దరూ ప్రేమకథా చిత్రాలు తీయడంలో దిట్ట. కానీ ఎందుకో సీతారామం సినిమా దగ్గరికి వచ్చేసరికి చేజేతులా అదృష్టాన్ని కాదనుకున్నారంటూ సినీవిశ్లేషకులు గుసగుసలు పెడుతున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరు స్టార్స్‌ మంచి సినిమా మిస్‌ అయ్యారని అభిమానులు అంటున్నారు.

చదవండి: భారీ సక్సెస్‌, డైరెక్టర్‌కు డైమండ్‌ రింగ్‌, సూర్య, కార్తీలకు డైమండ్‌ బ్రాస్‌లెట్స్‌
బిగ్‌బాస్‌ షోలో బుల్లెట్టు బండి సింగర్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement