
దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్ ముఖ్య పాత్రలు పోషించారు. శనివారం ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజైంది. 'లెఫ్టినెంట్ రామ్.. నిన్నే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఓ కుటుంబం, కనీసం ఉత్తరం రాయడానికి ఒక్క పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది' అంటూ హీరో గురించే ఆలోచిస్తున్న హీరోయిన్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది.
ఎవరూ లేని అతడికి అన్నీ తానే అవడానికి రెడీ అవుతుంది హీరోయిన్. అతడికి ప్రేమలేఖలు రాయడం మొదలుపెడుతుంది. 'నీ భార్య సీతామహాలక్ష్మి' అంటూ అతడికి ఉత్తరాలు రాస్తుంది. ఆమె ఎవరా? అంటూ తన గురించి ఆలోచించడం మొదలుపెడతాడు హీరో. మరి వీరి ప్రేమ కావ్యాన్ని చూడాలంటే ఆగస్టు 5 వరకు వేచి చూడాల్సిందే! కాగా సీతారామంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
చదవండి: ఖరీదైన ఎస్‌యూవీ కారు కొన్న స్టార్ హీరో
7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లి?, ఫొటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment