
‘సీతారామం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకుర్. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ జాబితాలో చెరిపోయింది. అందం, అభినయం, తనదైన నటనతో తొలి చిత్రంతోనే ఎంతో ప్రేక్షక ఆదరణ పొందిన ఆమెకు ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పెళ్లి కాకపోయిన పిల్లల్ని కంటాను అంటూ చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి.
చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల ఏం చేస్తుంటారో తెలుసా?
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. 30 ఏళ్ల వయసున్న స్త్రీలు డేటింగ్, ప్రేమ, పెళ్లి, పిల్లలు గురించి ఆసక్తిగా ఉండరు అనే అంశంపై స్పందించింది. ‘నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికనప్పుడే పెళ్లి చేసుకుంటాను. నా మనసుని అర్థం చేసుకుని, నా మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే వ్యక్తి నా జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నా. అతడు నా వృత్తిని కూడా గౌరవించాలి. మన చుట్టూ చాలా అభద్రత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు రక్షణ కల్పించే వ్యక్తి కావాలి. అలాంటి వాళ్లు దొరకడం చాలా అరుదు. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకపోతే పెళ్లి చేసుకోను’ అని చెప్పుకొచ్చింది.
చదవండి: టాలీవుడ్‌పై అమలా పాల్ షాకింగ్ కామెంట్స్..
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఈ సమాజంలో మహిళల జీవితాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పెళ్లి, వయసు, సంతానం అంటూ అనేక ప్రశ్నలు వేస్తారు. అయితే నాకు పెళ్లిపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ పిల్లలు అంటే ఇష్టం. అమ్మ అని పిలుపించుకోవాలని ఆశ. ఒకవేళ పెళ్లి చేసుకోకపోయిన నేను పిల్లల్ని కంటాను. అది టెస్ట్‌ట్యూబ్ బేబీ ద్వారా. నా పిండాన్ని భద్రపరిచి టెస్ట్‌ట్యూబ్ బేబీ ద్వారా అమ్మను అవుతానని మా అమ్మకి చెబితే తాను కూడా ఓకే చెప్పింది. నా నిర్ణయాన్ని ఆమె సంతోషంగా స్వాగతించింది’ అంటూ మృణాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment