ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' రికార్డ్.. మొత్తంగా ఎన్ని వచ్చాయంటే? | RRR Movie Won 7 Awards In 68th Filmfare South 2023 | Sakshi

Film Fare Awards 2023: ఫిల్మ్ ఫేర్ అవార్డులు.. ఏ విభాగంలో ఎవరికంటే?

Jul 12 2024 7:32 AM | Updated on Jul 12 2024 8:41 AM

RRR Movie Won 7 Awards In 68th Filmfare South 2023

2023 సంవత్సరానికి గానూ ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులని తాజాగా ప్రకటించారు. ఇందులో భాగంగా దక్షిణాదిలో నాలుగు భాషల్లో గతేడాదితో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాల్ని లెక్కలోకి తీసుకుని ఓవరాల్‌గా అవార్డులని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా 7 అవార్డులు దక్కాయి. అలానే సీతారామం సినిమాకు 5, విరాటపర్వం 2, 'భీమ్లా నాయక్'కి ఓ అవార్డు సాధించాయి. గతంలో 'ఆర్ఆర్ఆర్'కి రిలీజ్ తర్వాత నుంచి ఇప్పటికీ ఏదో ఓ అవార్డ్ వస్తూనే ఉండటం విశేషం. ఇకపోతే ఎవరెవరికీ ఏ విభాగంలో అవార్డు దక్కిందో దిగువన లిస్ట్ ఉంది చూసేయండి.

(ఇదీ చదవండి: సంప్రదాయబద్ధంగా నటి వరలక్ష్మి వివాహం)

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 (తెలుగు)

  • ఉత్తమ సినిమా - ఆర్ఆర్ఆర్

  • ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళి

  • ఉత్తమ మూవీ (క్రిటిక్స్) - సీతారామం

  • ఉత్తమ నటుడు - రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)

  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్  (సీతారామం)

  • ఉత్తమ నటి - మృణాల్ ఠాకుర్ (సీతారామం)

  • ఉత్తమ నటి (క్రిటిక్స్) - సాయిపల్లవి (విరాటపర్వం)

  • ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)

  • ఉత్తమ నటి - నందితా దాస్ (విరాటపర్వం)

  • ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - కీరవాణి (ఆర్ఆర్ఆర్)

  • ఉత్తమ లిరిక్స్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి - కానున్న కల్యాణం (సీతారామం)

  • ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషుడు) - కాల భైరవ (ఆర్ఆర్ఆర్- కొమురం భీముడో)

  • ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మహిళ) - చిన్మయి (సీతారామం- ఓ ప్రేమ)

  • ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్ - నాటు నాటు)

  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)

(ఇదీ చదవండి: రామ్‌ చరణ్‌ కొత్త కారు.. దేశంలోనే రెండోది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement