దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. మెల్‌బోర్న్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి.
(ఇదీ చదవండి: బాహుబలి కట్టప్ప కుటుంబంలో తీవ్ర విషాదం)
ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సీతారామం' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందకుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకుల మదిని తాకుతుంది. హను రాఘవపూడి దర్శకుడుగా తెరక్కెకిన ఈ చిత్రంలో సీత, రామ్‌గా మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ అద్భుతంగా మెంప్పించారు. తాజాగా ఈ రొమాంటిక్ పిరియాడిక్ చిత్రానికి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ IFFM అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ సంతోషంలో ఉంది.
(ఇదీ చదవండి: ఆరుదైన ఫీట్ చేరుకున్న రాధిక శరత్‌కుమార్)
ఉత్తమ వెబ్ సిరీస్‌గా విభాగంలో 'జూబ్లీ' ఉండగా ఉత్తమ డాక్యుమెంటరీగా 'టు కిల్ ఏ టైగర్' నిలిచింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో అదిరిపోయే నటనతో మెప్పించిన రాణీ ముఖర్జీకి బెస్ట్ యాక్టర్ (ఫిమేల్) అవార్డు దక్కింది. మోహిత్ అగర్వాల్ (ఆగ్రా) బెస్ట్ యాక్టర్ మేల్ కాగా పృథ్వీ కొననూర్‌కు బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు వరించింది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ డైవర్సిటీ అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment