Sita Ramam Movie Hey Sita Hey Rama Full Video Song Released - Sakshi
Sakshi News home page

Sita Ramam Movie: హే సీతా-హే రామ.. ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది.. చూశారా?

Published Thu, Sep 1 2022 4:31 PM | Last Updated on Thu, Sep 1 2022 6:10 PM

Hey Sita Hey Rama Full Video Song Out From Sita Ramam Movie - Sakshi

మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్, బాలీవుడ్‌ నటి మృణాల్‌ ఠాకూర్‌ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమైన ప్రేమ కావ్యం ‘సీతారామం’. ఆగస్ట్‌ 5న విడుదలైన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ థియేటర్లో ఈ మూవీ సందడి చేస్తోంది. ఈ ప్రేమ కావ్యానికి సాధారణ ప్రజలు మాత్రమే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికీ ఎంతో సినీ, రాజకీయ ప్రముఖులు సీతారామంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏకంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడే ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారంటే సీతారామం ఏస్థాయిలో గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్‌గా మారిన సూసైడ్‌ నోట్‌

మరి ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడ చూసిన సీతారామం పాటలే చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తున్న ఈ మెలోడియస్‌ సాంగ్స్‌ నుంచి సీతామాహాలక్ష్మి-రామ్‌ ప్రేమ గురించి నిర్వరించిన అద్భుతమైన ప్రేమ గీతం హే సీతా-హే రామ... తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్‌ వీడియో సాంగ్‌ను వదిలింది చిత్ర బృందం. పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో హీరో, హీరోయిన్ల మధ్య చిత్రీకరించిన ఈ పాట సినిమాకే హైలేట్‌ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే విడుదలైన క్షణాల్లోనే ఈ పాట లక్షల్లో వ్యూస్‌ రాబట్టి యూట్యూబ్‌ ట్రెండింగ్‌ జాబితాలో చేరింది. మరి ఈ అందమైన ప్రేమ గీతంపై మీరు ఓ లుక్కేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement