బ్రాండ్ ముఖ్యం బిగిలూ అంటున్నారు స్టార్ హీరోలు. వేసుకునే షర్ట్, ధరించే వాచీలు, షూస్.. ఇలా అన్నీ బ్రాండెడ్‌వే ధరిస్తున్నారు. ఈ జాబితాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. ఫ్యాషన్ ఐకానిక్ అల్లు అర్జున్ కూడా స్టైలిష్‌గా కనిపించేందుకు ఖరీదైన వస్తువులను, దుస్తులనే కొనుగోలు చేస్తాడు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం చాలావరకు సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడతాడు.
హైదరాబాద్‌లో జరిగిన సీతారామం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రభాస్ బ్లూ జీన్స్, టీ షర్ట్, తలకు క్యాప్‌తో కనిపించాడు. ప్రభాస్ వేసుకున్న టీ షర్ట్ ఏదో బాగుంది.. మనమూ ట్రై చేద్దాం అనుకునేరు. చూడటానికి సింపుల్‌గా కనిపిస్తున్నా దాని ఖరీదు మాత్రం ఎక్కువే. ప్రముఖ బ్రాండ్.. డాల్స్ అండ్ గబ్బానా డిజైన్ చేసిన ఈ టీషర్ట్ ధర అక్షరాలా ఇరవై వేల రూపాయలట. దీన్ని ఐదేళ్ల క్రితం కూడా ప్రభాస్ ధరించాడని అంటున్నారు ఫ్యాన్స్.
ఇకపోతే దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన సీతారామం సినిమా నేడు(ఆగస్టు 5) విడుదలైంది. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఇక ఇదే రోజు నందమూరి కల్యాణ్ రామ్ బింబిసార కూడా రిలీజైంది. మరి ఈ రెండు సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి!
చదవండి: ‘బింబిసార’ ట్విటర్ రివ్యూ
కమెడియన్ రఘు కారుమంచి ఇంట తీవ్ర విషాదం
Comments
Please login to add a commentAdd a comment