ఫుడ్ విషయంలో ప్రభాస్‌ని ఫాలో అవుతున్న ఎన్టీఆర్ | Jr NTR Arrange Delicious Food To Janhvi Kapoor At Devara Shooting | Sakshi
Sakshi News home page

NTR-Prabhas: జాన్వీ కపూర్‌కి ఎన్టీఆర్ ఫుడ్ ట్రీట్.. ఫొటో వైరల్

Published Thu, Aug 1 2024 10:03 AM | Last Updated on Thu, Aug 1 2024 10:21 AM

Jr NTR Arrange Delicious Food To Janhvi Kapoor At Devara Shooting

తెలుగు ఇండస్ట్రీలో ఫుడీ అనగానే ప్రభాస్ గుర్తొస్తాడు. ఎందుకంటే తనతో కలిసి పనిచేసిన హీరోయిన్లకు ఫుడ్ ట్రీట్ ఇస్తాడు. అంటే షూటింగ్ జరుగుతునన్ని రోజులు సౌత్ ఇండియాలో దొరికే అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్‌ని పంపిస్తాడు. ఇప్పటికే శ్రద్ధా కపూర్, పూజా హెగ్డే, దీపికా పదుకొణె లాంటి స్టార్స్.. ప్రభాస్ ఇచ్చే ఫుడ్ గురించి చెబుతూ తమ ఆనందాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో డార్లింగ్‌ని ఫాలో అయిపోతున్నాడు.

(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్)

ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' మూవీతో బిజీగా ఉన్నాడు. తొలి భాగానికి సంబంధించి చివర దశ షూటింగ్ జరుగుతోంది. హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాల్ని తీస్తున్నారు. ఇకపోతే షూటింగ్‌లో పాల్గొంటున్న జాన్వీ.. ఆతిథ్యం విషయంలో ఫుల్ హ్యాపీ. ఎందుకంటే తారక్ అలాంటి ఫుడ్ అరేంజ్ చేస్తున్నట్లు ఉన్నాడు. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో 'దేవర' షూటింగ్ అంటే తనకు ఇందుకే ఇష్టమని చెబుతూ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్న డైనింగ్ టేబుల్ పిక్ పోస్ట్ చేసింది.

ఇన్నిరోజులు ఫుడ్ విషయంలో ప్రభాస్ మాత్రమే అనుకున్నాం. కానీ ఇకపై ఎన్టీఆర్ కూడా కో యాక్టర్స్‌కి పసందైన ఫుడ్ పెట్టి ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడేమో! ఇదిలా ఉండగా 'దేవర'.. ఈ ఏడాది సెప్టెంబరు 27న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం అనిరుధ్ కూడా మ్యూజిక్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు.

(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement